Breaking News

ఐటమ్‌ సాంగ్‌లో స్టార్ హీరోయిన్.. ఏ సినిమానో తెలుసా?

Published on Thu, 10/15/2026 - 10:21

రోల్ చిన్నదా,పెద్దదా అన్నది ముఖ్యం కాదు. చిత్రంపై దాని ఇంపాక్ట్‌ ఉండాలి. ఇటీవల డోరతి చిత్రంలో నటి కీర్తీ సురేశ్‌  కేవలం మూడు నాలుగు సన్నివేశాల్లోనే కనిపించారు.అయితే చిత్రంలో ఆ పాత్ర ఇంపాక్ట్‌ చాలా ఎక్కువగా ఉంది. ఇకపోతే నటి శృతిహాసన్‌ కూడా చాలా డేరింగ్‌ డెసిషన్‌ తీసుకుంటారని చెప్పవచ్చు. హీరోయిన్‌గా నటించినా, ప్రత్యేక పాటల్లో నటించినా గ్లామర్‌ ను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనుకాడరు. అలా  కొన్ని చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ కూడా చేశారు.

తాజాగా ఒక క్రేజీ చిత్రంలో ప్రత్యేక పోషించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తంగలాల్‌ వంటి వైవిధ్య భరిత కథా చిత్రం తరువాత దర్శకుడు పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం వేట్టువన్‌. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్‌ రేష్మి యో ఫిలిమ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అట్టకత్తి దినేష్‌ హీరోగా, ఆర్య విలన్‌ గా నటిస్తున్నారు.అశోక్‌ సెల్వన్, కళైయరసన్, విఘ్నేష్, ఫాహత్‌ ఫాజిల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటి శోభిత ధూళిపాళ హీరోయిన్‌గా నటిస్తోంది.

(ఇది చదవండి: గ్రాండ్‌గా రష్మిక క్లోజ్‌ ఫ్రెండ్‌ సీమంతం.. వీడియో వైరల్)

ఈ చిత్రం ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌ స్టర్స్‌ కథాంశంతో రూపొందుతోంది. చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తయింది. వర్డ్‌ ఆఫ్‌ వేట్టువన్‌ పేరుతో ఇటీవల చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు.అయితే ఇప్పుడు కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నటి శృతిహాసన్‌ ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ పాత్ర చిత్రంలో కీలకంగా ఉంటుందని సమాచారం. ఇందులో నిజం ఎంత అన్నది యూనిట్‌ వర్గాలు అధికారికంగా వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే  శృతిహాసన్‌ నటుడు విజయ్‌ సేతుపతి జంటగా నటించిన ట్రైన్‌ చిత్రం డిసెంబర్‌ 4వ తేదీన తెరపైకి రానుంది. 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)