Breaking News

నన్ను బాధపెట్టేలా చేయకండి: సీనియర్ నటుడు గౌతంరాజు

Published on Wed, 10/14/2026 - 12:27

టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ గౌతమ్ రాజు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రస్తుతం చాలా ఆరోగ్యంగానే ఉన్నానని గౌతమ్ రాజు తెలిపారు. నటుడిగా వందల సినిమాల్లో నటించానని వెల్లడించారు. నా గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను బాధపెట్టేలా వార్తలు రాశారని గౌతమ్ రాజు అన్నారు. నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని రాశారు. దయచేసి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. నా కెరీర్‌లో నటుడిగా చెప్పుకోవడానికి నా దగ్గర వందల సినిమాలు ఉన్నాయని కూడా వెల్లడించారు.

కాగా.. గౌతమ్ రాజు నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కొన్ని వందల సినిమాలు చేశారు. అగ్ర హీరోల చిత్రాల్లో తనదైన హవాభావాలతో, నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా.. సీరియల్స్‌లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై రూమర్స్ రావడంతో సోషల్ మీడియాలో స్పందించారు. తాను 200లకు పైగా సినిమాల్లో నటించానని గౌతమ్ రాజు వెల్లడించారు. ఘరానా మొగుడు, వినోదం, ప్రేమకు వేళాయెరా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని గుర్తుచేశారు.

(ఇది చదవండి: రణబాలిలో నా రోల్.. ఆమె పేరుతోనే: రష్మిక)

తాను ఏ పత్రికకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని గౌతమ్ రాజు తెలిపారు. తనపై వచ్చిన వార్తను చూసి స్నేహితులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వారిని చూసి జాలిపడటమే కాకుండా.. వీలైతే సహాయం చేయాలని అన్నారు. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. తన గురించి తప్పుడు కథనాలు రాయొద్దని.. సోషల్ మీడియా ప్రతినిధులను కోరారు. 
 

Videos

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బుద్ధిలేని గేమ్.. హౌస్ లో మరో బిగ్ ట్విస్ట్

ఏపీ లోకల్ ఫెట్ మూడు దశల్లో మున్సిపల్ ఎన్నికలు

Photos

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)

+5

రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. విరోష్ జంట క్యూట్‌ మూమెంట్స్ (ఫోటోలు)

+5

'ఆలియాస్ రుక్మిణీ'గా ఆఫియా సయ్యద్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)

+5

‘గరివిడి లక్ష్మి’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)