Breaking News

జెర్సీలు అ‍మ్మకానికి పెట్టిన పీవీ సింధు.. దీపికకు ఆర్థిక సాయం

Published on Sat, 10/10/2026 - 20:34

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తనకు ఎంతో ప్రత్యేకమైన జెర్సీలు, దుస్తులను విక్రయానికి ఉంచారు. అయితే ఇది సాధారణ విక్రయం కాదు. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, ఆ దిశగా సేవలందిస్తున్న దీపికా పదుకొణె ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ సింధు తన సేకరణలోని ఏయే దుస్తులను విక్రయానికి ఉంచారు? వాటి ధరలు ఎంత? వాటి వివరాలు తెలుసుకుందాం.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కొన్నేళ్లుగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె స్థాపించిన ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ (TLLLF) పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  అయితే అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీపికా తన వ్యక్తిగత దుస్తుల సేకరణకు సంబంధించిన కార్యక్రమాన్ని మరింత తెలిసేలా చేశారు. 

గతంలో తన వార్డ్‌రోబ్‌లోని దుస్తులను విక్రయించి ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చేవారు. ఇప్పుడు ‘ఫీచర్డ్ క్లోసెట్స్’ పేరుతో క్రీడలు, వినోదం తదితర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తమ వ్యక్తిగత దుస్తులను ఈ కార్యక్రమానికి అందించేలా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి అతిథిగా పీవీ సింధు నిలివడం విశేషం.

రూ.850 నుంచి రూ.1,100 వరకు..
పీవీ సింధు తనకు ప్రత్యేకమైన జెర్సీలు, జెర్సీ సెట్లు, ఇతర దుస్తులను ఈ కార్యక్రమం కోసం అందించారు. వీటి ధరలు రూ.850 నుంచి రూ.1,100 వరకు ఉన్నట్లు సమాచారం. అభిమానులు ఈ దుస్తులను కొనుగోలు చేయడం ద్వారా తమ అభిమాన క్రీడాకారిణికి సంబంధించిన జ్ఞాపకాలను సొంతం చేసుకోవడంతో పాటు, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు అవకాశముంటుంది.

(ఇదీ చదవండి: రాజమౌళికి సిగ్గు ఎక్కువ.. మా ప్రేమ అలా మొదలైంది: రమా రాజమౌళి)

ఈ విషయాన్ని దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘ ఏడేళ్ల క్రితం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది మద్దతుగా నిలిచారు.  ఇప్పుడు ఇతర ప్రముఖుల వ్యక్తిగత దుస్తులను కూడా అభిమానులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. పీవీ సింధును తొలి అతిథిగా ఎంపిక చేసుకోవడం ప్రత్యేకం. ఆమె పట్టుదల, పోరాట స్ఫూర్తి, అంకితభావం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి.అని పేర్కొన్నారు.

సింధు ఏమన్నారంటే?
క్రీడాకారులను మానసికంగా ఎంతో దృఢంగా ఉండే వ్యక్తులుగా చూస్తుంటారు. అయితే వారు కూడా ఎన్నో సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటి గురించి మాట్లాడటం ఎంతో అవసరం. మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి మరింత అర్థం చేసుకునే మనస్తత్వం, సహకారం లభించేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎలా ఉపయోగపడుతుంది?
దీపికా పదుకొణె ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖులు తమ వ్యక్తిగత దుస్తులను అందిస్తారు. వాటిని అభిమానులు కొనుగోలు చేయవచ్చు. ఈ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, మానసిక ఆరోగ్య సహాయక సేవలకు ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: మాకు పిల్లలు పుట్టేలోపు.. గుర్రాలను పెంచుకుంటా: విజయ్‌ దేవరకొండ

 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)