Breaking News

'కావాలనే పని కట్టుకుని చేస్తున్నారు'..విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్

Published on Thu, 10/08/2026 - 21:10

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తనపై, భార్య రష్మికపై వస్తున్న ట్రోల్స్, నెగిటివిటీపై సీరియస్‌గా స్పందించారు. రణబాలి ట్రైలర్ ఈవెంట్‌కు హాజరైన విజయ్.. విమర్శలపై స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్లకు బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? ఎవరికోసం నేను మారబోనంటూ వ్యాఖ్యానించారు.  సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌లో 90 శాతం కావాలని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నవేనని విజయ్ దేవరకొండ ఆరోపించారు.

ఒక 50 మంది కూర్చుని ఒక్కొక్కరు 20 నుంచి 1000 అకౌంట్స్ క్రియేట్ చేసి కావాలని నెగిటివిటీని సృష్టిస్తున్నారని విజయ్ విమర్శించారు. రణబాలి సినిమా ట్రైలర్ రాకముందే ఇది బ్రిటీశ్ సినిమా అంటూ కొన్ని వర్గాలు కావాలని వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరినైనా కలవకుండానే, వ్యక్తిగతంగా తెలియకుండానే ఇలా బలమైన అభిప్రాయాలను క్రియేట్ చేయడం వెనుక ఒక పెద్ద మెషినరీ పనిచేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.  తెలుగు సినిమా అయిన రణబాలి కాకుండా మనం జైలర్‌-2కు పోదాం అని సడెన్‌గా 50 అకౌంట్స్‌ నుంచి ఒకే రీల్‌ షేర్‌ అవుతుందన్నారు.  అందరూ ఒకే అభిప్రాయాన్ని రీల్‌గా షేర్‌ చేస్తున్నారంటే ఎవరో కూర్చొని డబ్బులు పెట్టి మరీ చేయిస్తున్నారని అర్థం.. వ్యవస్థ అలా తయారైంది. దీన్ని మనం ఆపలేమన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..' ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేయిస్తున్న వాడు రేపు ఏఐతో కూడా అదే పని చేయిస్తారు. అప్పుడు ఈ పనిచేసే వాళ్లు ఏం చేస్తారు? సినిమాను ప్రచారం చేయడానికి నేను సపోర్ట్‌ చేస్తా. ఎవరో ఒకరు బాగుపడతారు. అదే టూల్‌ను ఒకరిని కిందకు లాగడానికి ఉపయోగిస్తే ఎందుకురా ఈ పనులు అనిపిస్తుంది. ఇలా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నాకు ఏడేళ్లు పట్టింది. నేను ఖాళీ చేతులతో వచ్చి, నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఏడేళ్ల నుంచి అర్థం కాలేదు. గత ఏడాది ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. నాకు ఏం జరుగుతుందో అర్థమైంది' అనిఅన్నారు.
 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)