Breaking News

నో ఫుడ్‌..రోజుకో షవర్మ....ఇపుడు రూ. 1.04 కోట్లు

Published on Sat, 09/26/2026 - 20:29

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన దుబాయ్‌. అలాంటి  నగరానికి చేతిలో చిల్లి గవ్వ  లేకుండా,  ఉద్యోగం లేకుండా వెళ్లడం అంటే సాహసమే.  అలా వెళ్లి ఒక్కపూట తిండితో సరిపెట్టుకుని, అనేక కష్టాలు పడి, చివరికి విజయవంతమైన వ్యాపారవేత్తగా, కంటెంట్ క్రియేటర్‌గా ఎదిగిన ఆలియా లాలా సక్సెస్‌ స్టోరీ చాలా స్ఫూర్తిదాయకం. సొంతంగా ఒక కెరీర్‌ను నిర్మించు కోవాలనే దృఢ సంకల్పం ఉంటే సక్సెస్‌ వెదుక్కుంటూ వస్తుందని నిరూపించారు.

అబుదాబికి చెందిన ఆలియా లాలా తండ్రి సివిల్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్. తండ్రి డబ్బులు అడగడం ఇష్టం ఉండేది కాదు. ఏదైనా సాధించాలనే తపనతో ఉద్యోగం, పొదుపు లేకుండానే  దుబాయ్‌కు వెళ్లిపోయింది. ఒక పూట భోజనం కోసం డబ్బు సంపాదించుకోవడం నుంచి మొదలు  చివరికి 14 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఒక కెరీర్‌కు నాంది పలికింది. 

కష్టాల కొలిమి, టిప్సే ఆధారం
దుబాయ్‌లో  మొదట స్నేహితురాలితో కలిసి  షేరింగ్ స్పేస్‌లో ఉండేది. ఆమె రూమ్‌మేట్ రష్యన్.  రూమ్‌మేట్స్ కోసం వాటర్ బాటిళ్లు తెచ్చిపెట్టడం ద్వారా వచ్చే  రూ. 130-150 తో ఒక నెల గడిచింది. అలా ఉద్యోగం దొరికే వరకు రోజుకు ఒక షవర్మా మాత్రమే ఆమె ఆహారం. అయినా ఎక్కడా నిరాశ పడలేదు.
 


చిన్న చిన్న పనులు చేస్తూ మొదలుపెట్టిన ఆమె ప్రయాణం  14  ఏళ్లు దాటాయి.  ప్రస్తుతం ఆమె యూఏఈ-లైసెన్స్ పొందిన ట్రావెల్ అండ్ లైఫ్‌స్టైల్ కంటెంట్ క్రియేటర్. అంతర్జాతీయ బ్రాండ్లు, లగ్జరీ హోటళ్లు, టూరిజం బోర్డులతో కలిసి  పనిచేస్తుంది. కేవలం కంటెంట్ క్రియేషనే కాకుండా, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను బ్రాండ్లు, ట్రావెల్ ఏజెన్సీలతో అనుసంధానించే ఒక మీడియా హౌస్‌ను నడుపుతున్నారు. దీనితో పాటు యూఏఈ రియల్ ఎస్టేట్,  ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడులు పెడుతోంది.

 

ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్‌ జిహాద్‌ ఆరోపణలు కలకలం

వార్షిక సంపాదన
ప్రస్తుతం ఆమె సరాసరి వార్షిక సంపాదన దాదాపు 300,000 నుండి 400,000 దిర్హామ్‌లు (సుమారు రూ. 78.2 లక్షల నుండి రూ. 1.04 కోట్ల వరకు) ఉంది. తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించి, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేశానని, కాబట్టి కెమెరా వెనుక, కెమెరా ముందు ఉండటం ఎలా ఉంటుందో తనకు తెలుసునని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిందామె. తన సోషల్ మీడియా పేజీలను రెండుసార్లు కోల్పోయాను, మళ్లీ మళ్లీ మొదటి  నుండి ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో బహుళ ఆదాయ మార్గాల ద్వారా దీర్ఘకాలిక సంపదను సృష్టించడమే ఆశయంగా సాగుతోంది. తన వ్యాపారాలను విస్తరించడం, విలువైన ఆస్తులను కూడబెట్టడం,అంతర్జాతీయంగా తన పనిని విస్తరించడం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడమే ఆమె లక్ష్యం.
 

ఇదీ చదవండి: రూ. 2.87 లక్షల కోట్ల డీల్‌ : చైనా-అమెరికా కీలక ఒప్పందం

 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)