Breaking News

ఈ వీకెండ్‌ ఓటీటీకి వచ్చేసిన చిత్రాలు.. ఆ రెండు డోంట్‌ మిస్‌

Published on Sat, 09/26/2026 - 20:15

వీకెండ్‌ వచ్చేసింది.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో హారర్‌, థ్రిల్లర్‌, క్రైమ్‌, కామెడీ, యాక్షన్‌, రొమాంటిక్‌ జానర్‌లకు చెందిన పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా పలు కొత్త సినిమాలు డిజిటల్‌ ప్రీమియర్‌ అయ్యాయి. మరి ఈ ఆదివారం అస్సలు మిస్‌ కాకుండా చూడాల్సిన టాప్‌ ఓటీటీ మూవీస్‌, సిరీస్‌లు ఏంటో ఓసారి చూద్దాం..

అగధ: ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టిక్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘అగధ’. రహస్యమైన మరణాలు, అతీంద్రియ శక్తులు, ఉత్కంఠభరితమైన సంఘటనల చుట్టూ సాగే ఈ సినిమా సెప్టెంబర్‌ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హారర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఆసక్తికరమైన ఆప్షన్‌.

రంభ ఊర్వశి మేనక: అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’. దేవలోకంలోని రంభ, ఊర్వశి, మేనకల చుట్టూ జరిగే సరదా సంఘటనలతో సినిమా సాగుతుంది. కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేయాలనుకునేవారు ఈ మూవీని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో చూడొచ్చు. సెప్టెంబర్‌ 25 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది.

హాయ్ : నయనతార, కవిన్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ‘హాయ్‌’. విష్ణు ఎడవన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

బేబీ డూ ఆర్‌ డై: హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బేబీ డూ ఆర్‌ డై’. నచికేత్‌ సమంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రైమ్‌, యాక్షన్‌ అంశాలతో తెరకెక్కింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగు డబ్బింగ్‌లోనూ అందుబాటులో ఉంది.

హబీబీ: కస్తూరి రాజా ప్రధాన పాత్రలో నటించిన తమిళ పీరియాడికల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘హబీబీ’. మీరా కతిరవన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేమకథ నేపథ్యంలో సాగుతుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది.

మేన్షన్‌ హౌస్‌ మల్లేష్‌: తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోకి వచ్చిన మరో మూవీ ‘మేన్షన్‌ హౌస్‌ మల్లేష్‌’. కొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కూడా వీకెండ్‌ వాచ్‌ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

ఫోటోగ్రాఫర్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న తమిళ మూవీ ‘ఫోటోగ్రాఫర్‌’. ఫాంటసీ, థ్రిల్లర్‌ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది.

డోంట్‌ బీ షై: బ్రేకప్‌ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించే యువతి చుట్టూ తిరిగే రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘డోంట్‌ బీ షై’. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునేవారికి మరో ఆప్షన్‌.

షక్‌: ట్రస్ట్‌ నో వన్‌: పరిణీతి చోప్రా డిజిటల్‌ అరంగేట్రం చేసిన వెబ్‌సిరీస్‌ ‘షక్‌: ట్రస్ట్‌ నో వన్‌’. మిస్టరీ, క్రైమ్‌ అంశాలతో సాగిపోయే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రతి పాత్రపై అనుమానం కలిగించే కథనం, ట్విస్టులతో థ్రిల్లర్‌ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

యూనాబాంబర్‌: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న మరో ఆసక్తికరమైన కంటెంట్‌ ‘యూనాబాంబర్‌’. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్‌ డ్రామా క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ అంశాల చుట్టూ సాగుతుంది. క్రైమ్‌ స్టోరీస్‌ ఇష్టపడేవారు ఈ వీకెండ్‌లో దీనిని కూడా ట్రై చేయొచ్చు.
 

 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)