వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
కొత్త లుక్‌లో అనసూయ.. ఫొటోలు వైరల్
Published on Sat, 09/26/2026 - 16:10
నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలతో పాటు ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవల అనసూయ తన హెయిర్ స్టైల్‌ను మార్చుకున్నారు. ఇలా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘హెయిర్ స్టైల్ మార్చాను.. కానీ నాలో ఫైర్ మాత్రం అలాగే ఉంది’ అంటూ పోస్ట్ చేశారు.
‘ఈరోజు మీరు వ్యాయామం చేశారా?’ అంటూ అభిమానులను ప్రశ్నించారు. ‘కొత్త రూపం.. కొత్త ఉత్సాహం’ అంటూ తన తాజా చిత్రాలను పంచుకున్నారు. ఇప్పుడు అనసూయ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పంచుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా’: కేటీఆర్
Tags : 1