2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
పోలీసులకు జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు
Published on Wed, 09/23/2026 - 18:29
కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ భార్య సుమలత పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు డ్యాన్సర్లు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ బంజారాహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు మాస్టర్ తరఫున లేడీ డాన్సర్స్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే మినిట్స్ బుక్ విషయంలో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. సుమలత దౌర్జన్యంగా మినిట్స్ బుక్ లాక్కోవడంతో అడ్డుకున్నామని రఘు మాస్టర్ వర్గం లేడీ డాన్సర్స్ చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా.. ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుమలత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆమెకు మెజారిటీ డ్యాన్సర్స్ మద్దతు లేకపోవడంతో సుమలత వర్గాన్ని తొలగించారు. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోయింది. ఈ నిర్ణయంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మొత్తం 225 మంది డాన్సర్స్ హాజరయ్యారు. ఈ భేటీలో సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించడంతో సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల అక్టోబర్ 11న డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశంలో వెల్లడించారు.
Tags : 1