2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
కేవలం రూ.2 కోట్ల సినిమా.. రెండో సినిమాగా రికార్డ్..!
Published on Wed, 09/23/2026 - 16:25
కంటెంట్ ఉంటే చాలు ఎంత చిన్న సినిమా అయినా సరే కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం రూ.2 కోట్లతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులతో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.360 కోట్లకి పైగా వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కించిన హనుమాన్ అంశ్ ఇప్పటికే పలు రికార్డులు సాధించింది.
తాజాగా ఈ చిత్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఓవర్‌సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. ఓవర్‌సీస్‌లో విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఈ రికార్డ్ సాధించింది. ఆగస్టు 7న భారతదేశంలో విడుదలైన హనుమాన్ అంశ్.. విదేశాల్లో సెప్టెంబర్ 11న రిలీజ్ చేశారు. హోంబలే ఓవర్సీస్, ఫార్స్ ఫిల్మ్‌తో కలిసి విదేశాల్లో విడుదల చేశారు.
ఇండియాలో ఇప్పటి వరకు రూ.280.93 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. 47 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఉత్తర అమెరికాలో ఆరు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఈ ఏడాది ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 బాలీవుడ్ చిత్రాల జాబితాలో చేరింది.
HANUMAN ANSH GOES GLOBAL! 🌎🔥#HanumanAnsh has crossed the $3.5 MILLION+ mark overseas in just 12 days, emerging as the 2nd Highest Overseas Grosser of 2026, as per the makers.
Read Here On #CellebIndia👇https://t.co/DE4BAvxklq pic.twitter.com/UBWdxlJX9h— Celleb India (@CellebIndia) September 23, 2026
Tags : 1