Breaking News

బిగ్‌బాస్ 10: అన్యాయం చేసిన ముకేశ్.. కుమిలి కుమిలి ఏడ్చిన దేబ్జానీ

Published on Wed, 09/23/2026 - 08:55

ప్రతివారం నామినేషన్స్ అంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కడలేని హడావుడి, గొడవలే. ఈసారి అంతకు మించి అన్నట్లు జరిగింది. సోమవారం సగం నామినేషన్ల ‍ప్రక్రియ పూర్తవగా మంగళవారం మిగతా తంతు ముగిసింది. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్‌లో 16వ రోజు(సెప్టెంబరు 22) అసలేం జరిగింది? ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారు?

(ఇదీ చదవండి: Bigg Boss 10: నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే: కృష్ణుడు)

సోమవారం ఎపిసోడ్‌లో సగం నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పటికీ సుధీర్-సృష్టి గొడవ ఎక్కువగా హైలైట్ అయింది. ఇందులో సృష్టి ప్రవర్తన నచ్చని రాంప్రసాద్.. అవకాశం వస్తే ఈమెని నామినేట్ చేయ్ అని నరేశ్‌తో చెప్పాడు. నాకు పాయింట్స్ లేవని నరేశ్ అంటే అంత పెద్ద పాయింట్ ఉంటే లేదు అంటావ్ ఏంటి? బిగ్‌బాస్ హౌస్‌లో ఒకర్ని కొడతా, తంతా అనడం ఎంతపెద్ద తప్పో తెలుసు కదా ఇదే పెద్ద పాయింట్ ఆ పాయింట్ మీద నామినేట్ చేయ్ అని రాంప్రసాద్ సలహా ఇచ్చాడు.

త్రిగుణ్ గురించి ఝాన్సీ, సుధీర్, ముకేశ్, రోహిత్ మాట్లాడుతూ.. మొదటి వారం నన్ను చాలా హీనంగా చూశాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతి చిన్న విషయాన్ని పాయింట్ చేసి కుక్కర్ ముఖం మీద వేశాడు. త్రిగుణ్ నిజంగా శకునినే ముందు ఆడడు వెనక నుంచి ఆడిస్తాడు. వంశీని ఎలా కీలుబొమ్మ చేశాడో ఇప్పుడు సృష్టిని అలాగే తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. సృష్టి కూడా వెళ్లిపోతుంది అని రోహిత్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. దీని తర్వాత గేమ్ గురించి ముకేశ్-చరణ్ గొడవపడ్డారు.

చివరి రౌండ్‌లో నామినేట్ చేయడానికి నరేశ్, షాలిని పోటీపడ్డారు. షాలినికి అవకాశం వచ్చింది. దీంతో వర్షిణిని నామినేట్ చేసింది. ముకేశ్‌ని గైడ్ చేస్తున్నావ్. సంచాలక్‌‌గా ఫెయిల్ అయ్యావ్. అందరికీ సలహాలు ఇస్తూ గేమ్‌లో కనిపించాలని ప్రయత్నిస్తున్నావ్. అది అంత అవసరం లేదు అనిపిస్తుంది అని షాలిని తన కారణాలు చెప్పింది. తర్వాత షాలిని నామినేట్ చేసే అవకాశం సృష్టికి ఇచ్చింది. సృష్టి సుధీర్‌ని నామినేట్ చేసింది. ఒక్కసారి కూడా నన్ను వాడుకున్నాననిపించలేదా అని సృష్టి అడిగితే.. దానికి బదులిచ్చిన సుధీర్ నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నా. నా వల్ల ఇబ్బంది ఉంటే చెప్పు అని.. ఎవరైనా ఏమైనా అంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పు అని కూడా అన్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో సృష్టితో అస్సలు మాట్లాడను అని కుండబద్దలు కొట్టేశాడు. అలా ఈ వారం నామినేషన్స్‌లో సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి నిలిచారు.

(ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్‌.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’)

మీ వాళ్ల నుంచి మంచి టెంప్టేషన్ పొందాలంటే ఒకరిని టెన్షలో పెట్టాల్సి వస్తుంది. లివింగ్ ఏరియాలో ఒక బజర్, గార్డెన్ ఏరియాలో ఒక బజర్ ఉంది. రెండింటిని మొదటిసారి నొక్కిన ఇద్దరు సభ్యులకు గేమ్ ఉంటుంది. గెలిచిన వాళ్లు టెంప్టేషన్ తీసుకొని టెన్షన్ ఒకరికి ఇవ్వాలి. టెన్షన్ తీసుకున్న వాళ్లు నెక్ట్ టైం గేమ్ ఆడటానికి వీల్లేదు అని బిగ్‌బాస్ చెప్పాడు. అలా లివింగ్ ఏరియాలో ముకేశ్ బజర్ నొక్కితే.. గార్డెన్ ఏరియాలో రోహిత్ బజర్ నొక్కాడు. ఇద్దరికీ పుష్ యువర్ లిమిట్స్ గేమ్ పెట్టగా.. ఇందులో మూడు పెద్ద బాక్స్‌లను ఇద్దరూ నెట్టుకోవాలి. ఈ గేమ్‌లో ముకేశ్ గెలిచాడు. తద్వారా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడంతో పాటు టెంప్టేషన్ సొంతం చేసుకున్నాడు.

ముకేశ్‌ని బ్యాక్‌యార్డ్‌కు పిలిచిన బిగ్‌బాస్.. ఫోన్ చేసి మాట్లాడాడు. ఇలాంటి గేమ్ కోసమే వెయిట్ చేస్తున్నా బిగ్‌బాస్.. రోహిత్ మీద గెలవడం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. టెంప్టేషన్‌గా మీ నాన్నతో కలిసి ఉన్న ఫొటో మీకు దక్కుతుంది. దీని కోసం మీరు దేబ్జానీ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ని తనకు దూరం చేయాలి. లేదా వర్షిణికి తన ఫ్యామిలీ ఫొటో దూరం అవుతుంది. ఎవరికి ఏం దూరం చేసి వాళ్లకు టెన్షన్ ఇస్తారు అని బిగ్‌బాస్ అడిగితే ఇద్దరితో నాకు మంచి బాండ్ ఉంది. కానీ వర్షిణితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. వర్షిణి నన్ను మంచి ఫ్రెండ్‌ అనుకుంటుందని చెప్పి దేబ్జానీకి టెన్షన్ ఇస్తా అని ముకేశ్ అన్నాడు.

ఇదే విషయం దేబ్జానీకి చెప్పమని బిగ్‌బాస్ అనడంతో ముకేశ్ దేబ్జానీకి చెబుతాడు. నీ కోసం నన్ను టెన్షన్‌లో పెట్టావా వేరే ఎవరి కోసమైనా అని ఆమె అడగ్గా.. వేరే వాళ్ల కోసం అని ముకేశ్ అన్నాడు. తర్వాత బిగ్‌బాస్ ముకేశ్‌కి ఇచ్చిన ఆప్షన్‌ గురించి చెప్పడంతో దేబ్జానీ చాలా ఏడ్చింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)