నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్.. స్టోరీ లైన్ చెప్పేసిన నాని..!
Published on Sun, 09/20/2026 - 20:56
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని. ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించగా..ఈ మూవీ కథ లైన్ ఏంటో చెప్పేశారు. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు.
ఈ సినిమాలో ఒకట్రెండ్ ఎపిసోడ్స్‌ను శ్రీకాంత్ మరింత ఎక్స్‌ట్రీమ్‌గా తీశాడని అన్నారు. నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్స్ అవేనని పంచుకున్నారు. యాక్షన్ సీన్స్ ఒక కమర్షియల్ మాస్ సినిమాలో ఇలా ఉంటాయా అని థియేటర్లలో ఆడియన్స్ షాక్ అవుతారని అన్నారు. తాను మేకప్ వేసుకోవడానికి గంటన్నర పడితే.. జడల వల్ల రోజంతా వెనుకకు ఆనుకోవడానికి కూడా టైమ్ ఉండేది కాదని వెల్లడించారు. కొన్నిసార్లు ఏకంగా 36 గంటల పాటు షూట్ చేశామని.. లోపల స్కాల్ప్ అంతా ఎర్రబడి గాయాలయ్యాయని తాను పడ్డ కష్టాన్ని వివరించారు. జడల వల్ల ఎన్నో గాయాలు అయినా ప్రతీ షాట్ నేనే చేశా... థియేటర్లలో ప్రతీ ఫైట్, ప్రతీ పంచ్ పూనకాలు తెప్పిస్తుందని హైప్ పెంచేశారు నాని.
Tags : 1