నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
రష్మిక యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది
Published on Sun, 09/20/2026 - 20:17
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా లీడ్ రోల్‌లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
'అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను' అనే రష్మిక డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్ చూస్తుంటే తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే మహిళ పాత్రలో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'యుద్ధానికి ఆయుధమంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు' అనే డైలాగ్ మైసాపై మరింత ఆసక్తి పెంచుతోంది. రష్మిక ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు.
No fear to hold.
No truth to hide.
Just ONE promise to keep.#Mysaa – A DAUGHTER’S PROMISE.#MysaaTeaser out now ❤️🔥
-- https://t.co/kUg5j4XxA0
IN CINEMAS WORLDWIDE ON 27.11.26. 💥@iamRashmika @RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/AJCj8izHPY— UnFormula Films (@unformulafilms) September 20, 2026
Tags : 1