Breaking News

ఆ నలుగురు సేఫ్.. ఆ ఇద్దరు వరస్ట్.. వీకెండ్‌ హైలెట్స్ ఇవే..!

Published on Sat, 09/19/2026 - 22:30

బుల్లితెర రియాలిటీ షో అప్పుడే రెండో వారం చివరికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఈ వారం నేను చాలా ఎంజాయ్ చేశానని నాగ్ అన్నారు. అయితే ఈ వారంలో ఇద్దరు హౌస్‌లో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు.

ఆ ఇద్దరు కృష్ణుడు, సృష్టి ‍అని తెలియజేస్తూ ఓ వీడియోను చూపించారు. ఈ వారంలో వాళ్లిద్దరు హౌస్‌లో ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపించింది. దీంతో వాళ్లద్దరినీ స్టోర్ రూమ్‌కు పంపించారు. అదే క్రమంలో సింగర్ ఝాన్సీపై ప్రశంసలు కురిపించారు. హౌస్‌లో నువ్వే తొలి మహిళ కెప్టెన్ అని కొనియాడారు. ఆటను వందశాతం ఎఫర్ట్‌తో ఆడుతున్నావని అన్నారు.

హౌస్‌మేట్స్‌ను తమ లైఫ్‌లో జరిగిన సీక్రెట్‌ విషయాన్ని చెప్పాలని నాగ్ అడిగారు. దీనికి కంటెస్టెంట్స్‌ తమ జీవితంలోని జరిగిన సంఘటలను రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరంటూ నాగ్ హౌస్‌మేట్స్‌ను అడిగారు.

సుధీర్‌ను వర్షిని మానిపులేట్ చేస్తోందని చరణ్ అన్నారు. ఆ తర్వాత గేమ్‌లో రూల్స్ చదవకుండా గేమ్ ఆడతావా అని చరణ్‌ను నాగ్ ప్రశ్నించారు. ఇది మళ్లీ రిపీట్ చేయొద్దని సూచించారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్‌ను మానిపులేటర్‌ ఎవరని అడగ్గా.. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. దీనికి ఆడియన్స్‌ పోల్ నిర్వహించగా.. త్రిగుణ్ చేతిలో వంశీ పప్పెట్‌ అని తేలిపోయింది. రోహిత్ సైతం వంశీ, త్రిగుణ్‌నే ఎన్నుకున్నారు.

సంచాలక్‌గా ఇద్దరు ఫెయిల్..

సంచాలక్‌గా రామ్ ప్రసాద్‌ ఫెయిల్ అయ్యావంటూ నాగ్ అన్నారు. దీనికి అవును సార్ అంటూ రామ్ ప్రసాద్‌ తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత హౌస్‌లో చరణ్‌ను రోహిత్‌ మానిపులేట్ చేస్తున్నారని వర్షిని చెప్పింది. దీనికి ఆడియన్స్‌ పోల్ నిర్వహించగా.. అవుననే ఎక్కువమంది ఓటేశారు.

ఆ తర్వాత వర్షినిని సంచాలక్‌గా సరిగ్గా వ్యవహరించలేదని నాగ్ అన్నారు. సంచాలక్‌గా మీ నిర్ణయం కరెక్ట్‌గా లేదని.. అందుకే ఈ వారంలో నువ్వు సంచాలక్‌గా ఉండడానికి వీల్లేదని నాగార్జున చెప్పేశారు. గేమ్‌లో భాగంగా షాలిని, వర్షిణి మధ్య జరిగిన ఫైట్‌లో షాలినిదే తప్పని నాగ్ తేల్చేశారు.  ఈ వారంలో ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, శాలిని సేఫ్‌ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్‌సేఫ్‌గా మిగిలారు. 
 

 

 

 

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)