ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు
Breaking News
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?
Published on Mon, 09/14/2026 - 12:34
బిగ్‌బాస్ పేరు చెప్పగానే చాలామంది నామినేషన్ ప్రక్రియనే గుర్తొస్తుంది. ఎందుకంటే వారం మొత్తంలో ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది అంటే అది ఇదే. గతవారమే షో మొదలైంది కాబట్టి నామినేషన్లని నిర్వహించలేదు. కంటెస్టెంట్స్.. హౌస్మేట్స్ కావడంలో భాగంగా పోటీ జరిగింది. ఈ క్రమంలోనే చరణ్, చైత్ర తొలివారం ఎలిమినేట్ అయ్యారు. మరొకరు కూడా వెళ్లిపోతారని రూమర్స్ వచ్చాయి గానీ అలాంటిదేం జరగకుండానే వీకెండ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: వినసొంపుగా 'రామాయణ' తొలి పాట.. వీడియో రిలీజ్)
ఇక సోమవారం రావడంతో ఈ సీజన్లో తొలిసారి నామినేషన్ల హంగామా మొదలైంది. ఈసారి పెద్ద దిమ్మకు తాడు చుట్టి ఉంటుంది. తలో ఇద్దరూ ఒకకేసారి వెళ్లి ఆ తాడుని విప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా తాడుని పూర్తిగా తొలగిస్తారో వాళ్లకు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా ఛాన్స్ దక్కించుకున్న సుధీర్..త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. గేమ్ ఏమేం జరగకుండా చైత్ర పేరుని నువ్వు చెప్పడం నాకు నచ్చలేదని కారణం చెప్పాడు. అలానే వాష్‌రూమ్ క్లీన్ చేయమని పనిఇస్తే.. అది చేయకుండా ఉన్న పవర్ వేస్ట్ చేసుకున్నావ్ అని షాలినిని నామినేట్ చేశాడు.
మరోవైపు దేబ్జానీ కూడా త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. రోహిత్ కూడా త్రిగుణ్‌తో పాటు ఝాన్సీని నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతోందని, ఏ డిస్కషన్లోనూ తనకు కనబడట్లేదని ఈమె పేరు చెప్పాడు. ఈ సందర్భంగా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ రోహిత్-ఝాన్సీ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన తొలి ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
ప్రస్తుతం హౌస్‌లో 14 మంది ఉండగా.. వీళ్లలో ఈ వారం ఏకంగా 10 మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, కృష్ణుడు, రాంప్రసాద్, వర్షిణి, సుధీర్, రోహిత్, ముకేశ్, దేబ్జానీ.. ఈ లిస్టులో ఉన్నారట. సృష్టి, వంశీ, నరేశ్, అమన్.. ఈ వారం నామినేట్ కాకుండా సేఫ్ జోన్లో ఉన్నారని సమాచారం.
(ఇదీ చదవండి: ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్)
Tags : 1