Breaking News

థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన

Published on Sun, 09/13/2026 - 08:59

రీసెంట్ టైంలో అద్భుతమైన హిట్ అయి వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమా 'ఇరుముడి'. రవితేజ హీరోగా చేసిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయింది. రిలీజై దాదాపు మూడు వారాలు దాటిపోయినా సరే ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలా బిగ్ స్క్రీన్స్‌పై ఉండగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో విశేషాదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(సెప్టెంబరు 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అప్‌డేట్ ఇచ్చారు.

'ఇరుముడి' విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరిలో త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణి (బేబీ నక్షత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. త్రినాథ్ అయ్యప్ప స్వామి భక్తుడు. అందుకు తగ్గట్లే ప్రతి ఏడాది మాల వేస్తుంటాడు. మరోవైపు ఊళ్లో ఓ రౌడీ గ్యాంగ్ బాగా రెచ్చిపోతుంటుంది. జనాలను ఇబ్బంది పెట్టడం, స్కూల్‌కి వెళ్లే అమ్మాయిలను వేధించడం వాళ్ల పని.

త్రినాథ్ దీక్షలో లేనప్పుడు మందు కొడుతూ ఉంటాడు. అదే టైంలో ఊళ్లోని రౌడీలతో గొడవలకు దిగుతుంటాడు. అయితే త్రినాథ్ కూతురు మణికి గాయత్రి విషయంలో ఏదో తేడా జరుగుతోందని అనుమానం వస్తుంది. గాయత్రి.. గురుస్వామి (సాయి కుమార్) కూతురు. ఈ విషయం తన నాన్నకు చెప్పాలని మణి ప్రయత్నించినా చెప్పలేకపోతుంది. ఓ రోజు రాత్రి గాయత్రి అర్ధరాత్రి దాటినా ఇంటికి రాదు. అసలు ఆమెకు ఏమైంది? త్రినాథ్ ఆమెను వెతికి పట్టుకుంటాడా? ఆ రౌడీలకు తగిన బుద్ధి చెబుతాడా? లేదంటే కథలో ఇంకేదైనా పెద్ద ట్విస్ట్ ఉందా? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)