Breaking News

అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు

Published on Wed, 09/02/2026 - 10:35

'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా చేసిన 'టాక్సిక్' సినిమా అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తోంది. రిలీజ్ రోజు కాస్త హడావుడి కనిపించింది. కానీ తర్వాత నుంచి ఘోరంగా కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. అయితే ఎన్ని వందల కోట్లు నష్టాలు వచ్చాయనేది కొన్నాళ్ల తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ ఇంతలోనే యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ కారణంగా అవసరం వివాదం తెరపైకి వచ్చింది. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం నిర్మాత అల్లు అరవింద్ అన్న మాటలపై ఇప్పుడు ఈమె స్పందించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ వివాదంలో ఎంటరైన ఆర్జీవీ.. తనదైన శైలిలో ఆమెకు చురకలు అంటించాడు.

(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)

'యష్‌పై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల చుట్టూ జరుగుతున్న వివాదం మరీ నవ్వు తెప్పించేలా ఉంది. ఎందుకంటే పెద్ద సినిమాలని అప్పటివరకు పెద్దగా తెలియని నటులతో చేయడం గురించి ఆయన మాట్లాడినప్పుడు 'కేజీఎఫ్'కి ముందు తనకు యష్ ఎవరో తెలియదని చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటో కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.'

'హిందీ ప్రేక్షకులు బాహుబలి ముందు ప్రభాస్ ఎవరో తెలీదు. కాంతార ముందు రిషభ్ శెట్టి గురించి కూడా వారికి తెలీదు. అలానే నాకు 'గాడ్ ఫాదర్' ముందు మార్లన్ బ్రాండో గురించి తెలీదు. అంతకు ముందే వచ్చిన సినిమాలతో బ్రాండో స్టార్ అయ్యిండొచ్చు. కానీ అవి మన దేశంలో రిలీజయ్యేంతవరకు నాకు తెలీదు. అసలు విషయం ఏంటంటే ఆ సినిమాలు వాళ్లని పెద్ద స్టార్లుగా చేశాయి తప్పితే పెద్ద స్టార్లు కావడం వల్ల ఆ మూవీస్ పెద్దవి కాలేదు'

'హాలీవుడ్‌లో సాధారణంగా స్టార్స్‌పై కాకుండా కాన్సెప్ట్‌లపై పెట్టుబడి పెడతారు. క్రిస్టోఫర్ నోలన్ లాంటి దర్శకులు కూడా నటుల స్టార్‌డమ్ మీద ఆధారపడకుండా, వారి నటనా సామార్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేరున్న నటీనటులని ఎంపిక చేస్తారు. ఓపెన్ హైమర్ అయినా, ద ఒడిస్సీ అయినా అందులో ఎవరు నటిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఆ సినిమాలు వర్కౌట్ అవుతాయని మనకు తెలుసు'

'అల్లు అరవింద్ విషయానికొస్తే మంచి ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటల్ని కూడా వ్యక్తిగతంగా తీసుకునేవాళ్లు చాలా ఈగోతో(అహంకారం) ఉన్నావాళ్లే. నిజానికి అలాంటి కామెంట్స్‌కి వచ్చిన స్పందనే వాళ్లు ఎలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారో కూడా ఓ రకంగా అర్థమవుతోంది' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: యశ్ టాక్సిక్.. మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఘోరమైన రేటింగ్)

Videos

Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..

లండన్ లో త్రిష.. విజయ్ వెళ్ళేది ఆమె కోసమేనా!

టైల్స్ పై పడుకొని కెమెరా కెమెరా మెన్ లకు నమస్కారం

YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య

కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు

అడిగి అడిగి అలసిపోయాం.. అందుకే పోరాటంలోకి దిగాం

ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం

ఎవరు పూల సుబ్బయ్య.. వెలిగొండకు ఆయన పేరు ఎందుకు!

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

Photos

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)