సినిమా చరిత్రలోనే ఓ డైలాగ్‌ సీన్‌కు అరుదైన గౌరవం

Published on Tue, 09/01/2026 - 17:06

యాక్షన్‌ సినిమాలకు 1990ల దశకం ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే,’ ‘ది ఫ్యుజిటివ్‌,’ ‘స్పీడ్‌,’‘హీట్‌,’‘ది రాక్‌,’ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. అలాంటి సన్నివేశాల్లో ఒకటైన హీట్‌ (1995)లోని రెస్టారెంట్‌ సీన్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. సినిమా చరిత్రలోనే ‘గొప్ప డైలాగ్‌ ఎక్స్‌ఛేంజ్‌’గా ఈ సన్నివేశం ఓ మైలురాయిగా నిలిచింది.

తొలిసారి ఎదురెదురుగా..
మైఖేల్‌ మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీట్‌’లో అల్‌ పచినో, రాబర్ట్‌ డి నీరో ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్‌ అధికారి విన్సెంట్‌ హన్నా (అల్‌ పచినో), ప్రొఫెషనల్‌ నేరస్థుడు నీల్‌ మెక్‌కాలీ (రాబర్ట్‌ డి నీరో) మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఓ భారీ దోపిడీకి రెడీ అవుతున్న టైంలో మెక్‌కాలీని కాఫీ కోసం ఓ రెస్టారెంట్‌కు హన్నా ఆహ్వానిస్తాడు. అప్పటివరకు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవని వీరిద్దరూ తొలిసారి ఎదురెదురుగా కూర్చొని తమ జీవితాలు, ఎదుర్కొన్న కష్టాలు, నేరం, పోలీసు వృత్తి గురించి మాట్లాడుకుంటారు.

ఇదీ చదవండి: ప్రభాస్‌‘స్పిరిట్‌’షూటింగ్‌.. హైదరాబాద్‌లోనే ఎందుకంటే?

ఓ డైలాగ్‌ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది..

ఈ సన్నివేశంలో మెక్‌కాలీ చెప్పే ఓ డైలాగ్‌ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ‘పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఎలాంటి అనుబంధానికీ తాను లోనుకాను’ అని అతను చెప్తాడు. చివర్లో హన్నా తనను అడ్డుకుంటే మెక్‌కాలీని పట్టుకోవడానికి వెనుకాడనని అంటాడు. అదే సమయంలో తన దారికి అడ్డొస్తే హన్నాను చంపడానికి కూడా తాను వెనుకాడనని మెక్‌కాలీ  అంటాడు. ఒకరినొకరు గౌరవిస్తూనే ప్రత్యర్థులుగా నిలిచే ఈ సంభాషణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఇద్దరి నటుల మధ్య పోరు 
‘ఫార్‌ అవుట్‌ మ్యాగజైన్‌’కు చెందిన టామ్‌ టేలర్‌ రూపొందించిన ‘ది 10 గ్రేటెస్ట్‌ డైలాగ్‌ ఎక్స్‌ఛేంజెస్‌ ఇన్‌ మూవీ హిస్టరీ’ జాబితాలో ఈ రెస్టారెంట్‌ సీన్‌కు మొదటి స్థానం దక్కింది. ఇద్దరు స్టార్‌ నటులు తమ నటనా ప్రతిభతో ఈ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని టేలర్‌ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివింది: అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ పెట్టా..: విష్టుప్రియ

మరో ఆసక్తికరమైన విషయం..
ఇక ఈ సన్నివేశానికి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అల్‌ పచినో, రాబర్ట్‌ డి నీరో ఈ సీన్‌ను షూట్‌ చేయడానికి ముందు రిహార్సల్‌ చేయలేదట. హన్నా, మెక్‌కాలీ పాత్రలు అప్పటివరకు ముఖాముఖిగా కలవలేదు కాబట్టి ప్రాక్టిస్‌ చేయకుండానే నేరుగా సీన్‌ షూట్‌ చేస్తే సహజంగా ఉంటుందని డి నీరో భావించారట. దర్శకుడు మైఖేల్‌ మాన్‌ అందుకు ఓ‍కే చెప్పడంతో ఆ సన్నివేశం అలా చిత్రీకరించారట.

చదవండి: నాకూ బ్రేకప్‌ అయింది: విజయ్‌ దేవరకొండ

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)