Breaking News

రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే!

Published on Wed, 08/26/2026 - 10:48

యష్ 'టాక్సిక్'.. తెలుగులోనూ రిలీజ్ కావడం సంగతేమో గానీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో థియేటర్ల గురించి తెగ చర్చ నడుస్తోంది. ఈ డబ్బింగ్ సినిమా కోసం బాగా ఆడుతున్న 'ఇరుముడి'ని అన్యాయంగా థియేటర్ల నుంచి తీసేస్తున్నారని, 'టాక్సిక్' కోసం వాటిని కేటాయిస్తున్నారని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మొత్తం డిస్కషన్ అంతా దీని గురించే జరుగుతోంది. అయితే  ఇక్కడే ఓ చిత్రమైన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' ‍ట్విటర్ రివ్యూ)

సాధారణంగా ఏ కొత్త సినిమా రిలీజైనా సరే దానికి ఎక్కువగానే థియేటర్లు లేదంటే షోలు కేటాయిస్తారు. ఇప్పుడు 'టాక్సిక్' విషయంలోనూ అదే జరిగినట్లు కనిపిస్తుంది. అంతెందుకు హైదరాబాద్‌లోని రవితేజ సొంత థియేటర్ అయిన 'ఏఆర్‌టీ సినిమాస్'లోనే ఈరోజు.. 'ఇరుముడి'(7) కంటే 'టాక్సిక్'కే ఎక్కువగా 12 షోలు కేటాయించారు. మరి రవితేజకు తెలియకుండా ఈ విషయం జరిగి ఉంటుందా? దీని బట్టి అర్థమైంది ఏంటంటే సినిమా సినిమానే.. వ్యాపారం వ్యాపారమే!

ఒకటి రెండు రోజులు అయితే 'టాక్సిక్' టాక్ బట్టి ఈ సినిమాని థియేటర్లలో ఉంచాలా లేదంటే తీసేసి 'ఇరుముడి'కి ఇవ్వాలా అనేది డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకుంటారు. కానీ అంతలోనే సోషల్ మీడియాలో పెద్ద పంచాయతీ నడుస్తోంది. మరి ఈ రెండు మూవీస్‌లో ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఏది ముందంజలో నిలుస్తుందో చూడాలి? 'ఇరుముడి' సాధారణ టికెట్ రేట్లతో ప్రదర్శితమవుతోంది. 'టాక్సిక్'కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.50, రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

Videos

రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు

పందితో 30 నిమిషాల ఫైట్.. 14 ఏళ్ల కుర్రాడి దమ్ము చూస్తే షాక్!

ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)