Breaking News

విడుదలకు ముందే ‘టాక్సిక్‌’ కలెక్షన్ల వర్షం

Published on Mon, 08/24/2026 - 11:14

యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టాక్సిక్‌. విడుదలకు మరో రెండు రోజులే ఉండడంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం.. తాజా ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే దేశీయంగా రూ.32.52 ‍కోట్ల అడ్వాన్స్‌ వసూల్లు సాధించింది. ఇప్పటి వరకు 6లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

కేజీఎఫ్‌2తో పోలిస్తే.. 
యశ్‌ గత చిత్రం ‘కేజీఎఫ్‌2’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో పోలిస్తే టాక్సిక్‌ ఇంకా వెనుకబడే ఉంది. కేజీఎఫ్‌2 విడుదలకు ముందే దాదాపు రూ.60 కోట్ల అడ్వాన్స్‌ సేల్స్‌ నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ట్రేడ్‌ వర్గాల దృష్టి మిగిలిన రెండు రోజుల్లో టాక్సిక్‌ బుకింగ్స్‌ ఎంతవరకు పెరుగుతాయన్నదానిపైనే ఉంది.

రూ.100 కోట్లకు చేరాలంటే..
ప్రస్తుతం రూ.32.52 కోట్ల వద్ద ఉన్న టాక్సిక్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మరో రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది.  అయితే రూ.100 కోట్ల ప్రీ సేల్స్‌ మార్క్‌ను అందుకోవాలంటే ఇంకా దాదాపు రూ.67.5కోట్లు రాబట్టాలి.ఘీ వేగాన్ని చూస్తే ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమేనని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

యశ్‌ సరసన కియారా  అద్వానీ, నయనతార, రుక్షిణీ వసంత్‌, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ఇదీ చదవండి: క్రిస్మస్‌ బరిలో బాలయ్య..!

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)