అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
Breaking News
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
Published on Mon, 08/24/2026 - 10:16
మరోవారం వచ్చేసింది. ఈసారి యష్ 'టాక్సిక్', నయనతార 'హాయ్' లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'కికు చిరంజీవి' అనే తెలుగు మూవీ థియేటర్లలోకి రానుంది. వీటిలో యష్ చిత్రానికి మంచి హైప్ ఉంది. అందుకు తగ్గట్లే రెగ్యులర్‌గా శుక్రవారం నాడు కాకుండా బుధవారమే(ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనితో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ లాంటి తెలుగు సిరీసులు.. బంధర్ అనే హిందీ చిత్రం కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 24 నుంచి 30 వరకు)
హాట్‌స్టార్
ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 25
అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27
పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28
మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29
నెట్‌ఫ్లిక్స్
ద లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ డాక్యుమెంటరీ) - ఆగస్టు 26
లిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27
బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27
ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28
గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28
ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28
ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28
అమెజాన్ ప్రైమ్
ద లాస్ట్ సన్‌రైజ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 26
బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28
బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
సోనీ లివ్
అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28
జీ5
బంధర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28
ఆహా
ఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28
ఆపిల్ టీవీ ప్లస్
డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
లయన్స్ గేట్ ప్లే
హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28
(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)
Tags : 1