Breaking News

మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!

Published on Sun, 08/23/2026 - 15:01

కొన్ని ప్రేమకథలు ఎలా మొదలవుతాయో తెలియదు. వింటుంటే చాలా ఆశ్చర్యంగా, అస్సలు అదెలా సాధ్యం అనేలా ఉంటాయి. అలాంటి అందమైన ప్రేమకథ నెట్టింట వైరల్‌గా మారింది. మూవీని తలపించే వారి ప్రేమకథ వింటుంటే ఆశ్చర్యం, బాధ కలుగక మానవు. అన్ని ఎమోషన్స్‌ పలికించే ఆ అందమైన ప్రేమకథ ఎలా చిగురించిందంటే..

లోరెన్‌ స్టెఫానీ రెండేళ్ల క్రితం పర్యాటకురాలిగా భారత్‌లోకి అడుపెట్టి మరి కుటుంబం ఏర్పరచుకుని మరి తిరిగి పయనమైంది. అస్సలు ఆమె ఆస్ట్రేలియా నుంచి తమిళనాడులోని మధురైకి పర్యాటన నిమిత్తం వచ్చింది. కానీ ఆ పర్యాటన కాస్తా ఆమెకు భాగస్వామిని, ఓ కుటుంబాన్ని ఏర్పరిచింది. అది కూడా జస్ట్‌ మూడు గంటల జర్నీ ఆమె లైఫ్‌నే టర్న్‌ తిప్పింది. 

ప్రేమకు దారితీసిన ట్యాక్సీ జర్నీ..
మధుర విమానాశ్రయంలో దిగిన లోరెనా స్టెఫానీ అక్కడ తమిళనాడు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఒక ట్యాక్సీని మాట్లాడుకుంది. ఆ డ్రైవర్‌తో కలిసి సుమారు మూడు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో వారి మధ్య సంభాషణ స్నేహంగా, ఆ తర్వాత విడదీయరాని బంధాన్ని ఏర్పరిచి ప్రేమకు దారితీసింది. ఎంతలా అంటే..ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారింది. అయితే వారి మధ్య ఖండాల అంతరమే కాదు సంస్కృతుల పరంగా కూడా చాలా భేదం ఉంది. 

ఇక్కడ రబీక్ ముస్లిం. లోరెనా క్యాథలిక్. అంటే రెండు మతాలు. రెండు దేశాలు. రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలు మధ్య సాగిన అపూర్వ ప్రేమకథ. ఆ విషయం ఇరుకుటుంబాలకు తెలియజేసినప్పుడు మాములు వ్యతిరేకత రాలేదు. అస్సలు ఎవ్వరు అంగీకరించేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆ జంట ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ప్రక్రియను పూర్తిచేసి, తమ బంధాన్ని అధికారం చేసుకున్నారు. ఆ మార్గంలో  ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ..తమకు ఈ బంధం ఎంత ముఖ్యం అనేది ఆ క్లిష్టపరిస్థితులే అర్థమయ్యేలా చేశాయని అంటోంది ఈ జంట. 

సంతోషం..బాధ ఒకేసారి..
ఆ ఆ తర్వాత వారి జీవితంలో సంతోషకరమైన ఘట్టం కుమార్తె జననంతో వచ్చింది. అయితే లోరెనా ఆస్ట్రేలియాలోని ఆస్పత్రిలో కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ రబీక్‌ వీసా దృష్ట్యా భారత్‌లోనే ఉండిపోయాడు. ఫోన్‌లో తన బిడ్డను చూస్తూ తన ప్రేమను చాటుకుంటున్నాడు. బిడ్డ పుట్టిందని తెలిసినా రబీక్‌ వెళ్లి చూసుకోలేని పరిస్థితి అయినా..అది తనకు బాధకలిగిందని సగర్వంగా చెబుతోంది లోరెనా. ఎందుకంటే..ఈ బిడ్డ తమ ప్రేమకు చిహ్నమని, భౌతికంగా దూరంగా ఉన్నా మానిసికంగా తమ బిడ్డను కలిసే పెంచుతాం, సమంగా బాధ్యతలు పంచుకుంటామని అంటోంది లోరెనా. 
రెండు దేశాలు, ఒకే కుటుంబం..ఎప్పటికీ వదులుకోలేని ప్రేమ..

ఇక్కడ లోరెనా ఆస్ట్రేలియాలో ఉన్నారు. రబీక్ భారతదేశంలో ఉన్నారు. వారి కుమార్తె ఈ రెండు దేశాల మధ్య పెరుగుతోందని ఆమెకు తోడుగా తల్లి ఉంది, తండ్రి వీసా మంజూరు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అంటే..ప్రస్తుతం మా చిన్న కుటుంబం రెండు దేశాల్లో విస్తరించి ఉంది, అని నవ్వుతూ చెబుతోంది లోరెనా . 

రబీక్ తమ దగ్గరకు చేరే రోజు కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం వీసా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, దూరం అలాగే ఉంది..అయినప్పటికీ, లోరెనా ఈ కఠిన పరిస్థితిని అధిగమించి చివరికి చేరవవుతామనే నమ్మకం సడలదని ధీమాగా చెబుతోంది. ఎందుకంటే ఇప్పటికే తాము చాలా కష్టాలు ఓర్చుకుని ఇక్కడి వరకు వచ్చాం. దీన్ని కూడా కచ్చితంగా అధిగమించుతామని, తన భర్త రబీక్‌కు కచ్చితంగా వీసా మంజూరవుతుందని నమ్మకంగా చెబుతోందామె. తమది, మతాలు, సరిహద్దులు, వ్యతిరేకతలను దాటుకుని వచ్చిన ‘’స్వచ్చమైన ‍ప్రేమ’’ అని అంటున్నారు ఈ దంపతులు.

 

(చదవండి: ర్యాంకుల విషయంలో పిల్లల పట్ల అలా వ్యవహరించొద్దు..! హీరో సూర్య పేరెంటింగ్‌ టిప్స్‌)

 

Videos

ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)