పెట్టింది చీమంతా.. వచ్చింది కొండంతా.. ఆ సినిమాలు ఇవే!

Published on Tue, 08/11/2026 - 16:12

వందల కోట్లు ఖర్చు చేసినా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు కోలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి అంచనాలను తారుమారు చేసిన తమిళ సినిమాలూ ఉన్నాయి. స్టార్‌డమ్‌తో పనిలేకుండా కథలో దమ్ముండి బాక్సాఫీస్‌ వద్ద ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన కొన్ని తమిళ సినిమాల కోసం ఓ లుక్కేద్దాం..!

విత్‌ లవ్‌:
‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘విత్‌ లవ్‌’. ఇందులో ఛాంపియన్‌ బ్యూటీ అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించింది. మదన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌, మాగేశ్‌ రాజ్‌ కలిసి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.

తాయ్‌ కిళవి:
ఒకప్పటి హీరోయిన్‌ రాధిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ తమిళ సూపర్‌హిట్‌ చిత్రం ‘తాయ్‌ కిళవి’. రాధికను లీడ్‌ రోల్‌లో పెట్టి తమిళ హీరో శివకార్తికేయన్‌ నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.82 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

యూత్‌:
తమిళ నటుడు కరుణాస్‌ వారసుడు కెన్‌ కరుణాస్‌ హీరోగా పరిచయమైన చిత్రం ‘యూత్‌’. ఈ సినిమాకు కెన్‌ కరుణాస్‌ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. కురప్పయ్య సీ రామ్‌, సులోచన కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.81 కోట్ల వసూళ్లు రాబట్టింది.

బ్లాస్ట్‌:
అర్జున్‌ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్‌’. తెలుగులో ‘బ్లాస్ట్‌ జోన్‌’ పేరుతో విడుదలైంది. సుభాష్‌ కె.రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. రవి బస్రూర్‌ సంగీతం అందించారు. లీడ్‌ రోల్స్‌లో నటించిన వారు పెద్ద స్టార్లు కాకపోయినా.. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)