అచ్యుతం కేశవం: అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊర్లో వాళ్ళందరూ..

Published on Mon, 08/10/2026 - 08:54

అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడి గుడి కట్టారు. అదే ఊరికి చెందిన ఆవు పాలను అమ్మే ఓ మహిళ శ్రీకృష్ణుడి భక్తురాలిగా మారింది. తన మంచి చెడ్డలు, కష్ట సుఖాలు కృష్ణుడికి చెప్పుకునేది. తన భర్త కాలమయ్యాక ఆమెకు భక్తి మరింత ఎక్కువయ్యింది.

ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. అతడు అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడటం చేస్తుండేవాడు. అక్కడే అమెరికాలో ఉన్న కన్నడ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా కి రావడం తగ్గించాడు. కాగా ఆ ఊరి వాళ్ళు  నెలనెలా కంతులవారీగా డబ్బును ΄÷డుపు చేసేవారు. అలా సమకూరిన డబ్బుతో రెండేళ్ళ కొకసారి తీర్థయాత్రలు చేసేవారు.

ఆ తీర్థయాత్రల్లో ఓ సారి ఆమెకు ఒక కన్నడ వృద్ధురాలు పరిచయమయ్యింది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ఆ వృద్ధురాలు ఉడిపి కృష్ణుడి గురించి, స్వామి మహత్యాల గురించి విశేషంగా వర్ణించింది. అక్కడ బాలకృష్ణుడి  రూపంలో స్వామి దర్శనమిస్తాడని, ఆయనను నేరుగా కాకుండా నవరంధ్ర కిటికీ ద్వారా దర్శించాలని చెప్పింది.

అప్పటినుంచి ఆ పాలమ్మే మహిళకు ఉడిపి కృష్ణుడిని చూడాలని కోరిక మొదలయ్యింది. ఊరి వారు చేసే తీర్థయాద్రల్లో ఎన్నో గుడులూ గోపురాలు చూసింది కానీ ఉడిపి గుడికెళ్ళడం కుదరలేదు. ‘కృష్ణా... కరుణించవా’ అని స్వామిని వేడుకునేది. ‘ఉడిపి కృష్ణుని చూడని కళ్ళు కళ్ళేనా’ అని మదనపడేది. వయసు అరవై దాటింది. స్వామిని చూడకుండానే కాలం గడిచిపోతుందేమోనని భయం పట్టుకుంది. అదే విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడేది.

3హఠాత్తుగా ఒకరోజు రాత్రి కొడుకు ఫోన్‌ చేసి, తనకు కూతురు పుట్టిందని, ఆరవ నెలలో అన్న్రపాశన అనీ, తన భార్య కుటుంబీకులకు ఉడిపిలో అన్న్రపాశన చేసే సంప్రదాయం ఉంది కాబట్టి తాము ఇండియా వస్తున్నామని, తమతోపాటు నువ్వు కూడా ఉడిపి వస్తే బాగుంటుందని అమ్మను కోరాడు. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా చెప్పుకుని పొం​గిపోయింది.

ఇండియాకి వచ్చిన కొడుకు, కోడలుతో మొదటిసారిగా విమానం ఎక్కింది. అది ఉడిపికి దగ్గరగా ఉండే షిమాగో వరకు వెళ్ళే విమానం. ఆమె తనతోపాటు చిన్న సంచి కూడా తీసుకు వచ్చింది. అందులో హుండీలో వేయడానికి డబ్బు దాచి ఉంది. తను పెంచే ఆవులకు దూడలు పుట్టిన ప్రతిసారీ అమ్మే జున్ను ద్వారా వచ్చిన డబ్బులవి.
మనవరాలిని ఆడించుకుంటూ ‘అచ్యుతం కేశవం’ అనే పాట పాడుకుంటూ ఆమె ఉడిపి గుడిలోకి ఆధ్యాత్మికానందంతో అడుగు పెట్టింది.
– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)