Breaking News

మరో ప్రేమకథలో..?

Published on Sun, 08/09/2026 - 01:07

యంగ్‌ హీరోయిన్స్‌ జాన్వీ కపూర్, శ్రీలీల కలసి హిందీలో ఓ సినిమా చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడు ఉమేష్‌ బిష్ట్‌ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీతో కూడిన డార్క్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథను రెడీ చేశారట. ఏక్తా కపూర్, గునీత్‌ మోంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ఈ చిత్రంలోనే జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్‌ రోల్స్‌లో నటించనున్నారని బాలీవుడ్‌ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయట. ఒకే అబ్బాయిపై ఇద్దరు అమ్మాయిలు విపరీతమైన ప్రేమ పెంచుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బీ టౌన్‌ టాక్‌.

అలాగే ఈ చిత్రంలో కొన్ని క్రైమ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయట. కాగా, ఈ సినిమాలో హీరోగా నటించే యాక్టర్‌ కోసం దర్శక–నిర్మాతలు పలువురి యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఓ హీరోను ఫైనలైజ్‌ చేసి, సినిమాను అధికారికంగా ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారని భోగట్టా. మరి... ఇద్దరు అమ్మాయిల ప్రేమను పొందగలిగే ఆ హీరో ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... హిందీలో శ్రీలీల ఇప్పటికే కార్తీక్‌ ఆర్యన్‌ సరసన ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఫిక్స్‌ అయితే... బాలీవుడ్‌లో మరో ప్రేమకథా చిత్రం శ్రీలీల డైరీలో ఉంటుంది.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)