Breaking News

ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా.. తెలుగు రివ్యూ

Published on Sat, 08/08/2026 - 20:28

అప్పుడప్పడు క్రేజీ కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తుంటాయి. చూస్తున్నంతసేపు వావ్ అనిపిస్తాయి. అలాంటి ఓ మూవీనే 'బ్యాక్ రూమ్స్'. 20 ఏళ్ల అమెరికన్ యూట్యూబర్ కేన్ పార్సన్స్ దీనికి దర్శకుడు. ఈ హాలీవుడ్ చిత్రం మన దగ్గర ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో రిలీజైంది. సరికొత్త హారర్ ఫీల్‌తో భయపెట్టింది. ఇప్పుడిది సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? అంతగా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: 'కొరియన్‌ కనకరాజు' మూవీ రివ్యూ)

కథేంటి?
క్లార్క్(చివటేల్ ఎజియోఫోర్) ఓ ఆర్కిటెక్ట్. కానీ పరిస్థితుల కారణంగా ఓ ఫర్నీచర్ స్టోర్‌లో పనిచేస్తుంటాడు. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా స్టోర్‌లోనే బతికేస్తుంటాడు. ఇతడి థెరపిస్ట్ మేరీ(రెనే రెయిన్స్‌వ్‌). ఓ రోజు క్లార్క్.. అనుకోకుండా తన స్టోర్‌లోనే ఉన్న ఓ రహస్య ప్రదేశాన్ని చూస్తాడు. అనుకోని పరిస్థితుల్లో దాని లోపలికి వెళ్తాడు. అదో అనంతమైన పసుపు గదుల సమూహం. ఇంతకీ ఇవేంటి? ఈ 'బ్యాక్ రూమ్స్' నుంచి క్లార్క్ బయటపడ్డాడా? ఇతడి కోసం వెతుకుతూ అందులోకి వెళ్లిన మేరీకి ఏమైంది? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇది రెగ్యులర్ సినిమా కాదు. దెయ్యాల్లాంటివి లేకపోయిప్పటికీ భయపెడుతుంది. చిత్రమైన సీన్స్ దెబ్బకు జుగుప్సకరంగానూ అక్కడక్కడ అనిపిస్తుంది. అదే టైంలో తర్వాత ఏం జరుగుతుందనే థ్రిల్ పంచుతుంది. ఓవరాల్‌గా ఈ మూవీ మీకో చిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది.

మనిషి తన ‍ట్రామా నుంచి పారిపోతూ తన తప్పుల్ని అంగీకరించకుండా అదే జ్ఞాపకాలతో బతికితే చివరకు తనలోని డార్క్‌నెస్సే మనల్ని ఎలా మింగేస్తుంది అనే అంశాన్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా ఇందులో చూపించారు. ప్రధాన పాత్రధారి అయిన క్లార్క్ ట్రామాకు బలవగా.. మేరీ మాత్రం దాన్ని ఎదురించి బయటపడుతుంది. అయితే ఈ మూవీ హారర్ కంటే సైకలాజికల్ హారర్ అనుభవాన్ని అందిస్తుంది. ట్రామా ఎదురైతే బాధపడటం కంటే దాన్ని ఎదుర్కోండి అనే సత్యాన్ని విజువల్‌గా చూపిస్తుంది.

ఇంగ్లీష్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో స్టోరీ చాలా సాధారణంగా మొదలవుతుంది. కానీ ప్రధాన పాత్రధారి అయిన క్లార్క్.. ఎప్పుడైతే అనంతమైన పసుపు గదుల్లోకి అడుగుపెడతాడో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు దీని నుంచి ఎలా బయటపడతాడు? అనిపిస్తుంది. స్టోరీకి కనెక్ట్ అయితే మనం కూడా అతడితో అందులో చిక్కుకుపోయామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

'అ‍బ్సెషన్' తరహాలోనే ఈ సినిమాలోనూ ప్రధానంగా రెండే పాత్రలు కనిపిస్తాయి. ఇవి కాకుండా మరో మూడు నాలుగు ఉంటాయంతే. అమెరికాతో పాటు విదేశాల్లో సెన్సేషన్ సృష్టించింది. గంట 50 నిమిషాల పూర్తి మూవీ చూసినా సరే చాలా సందేహాలు మిగిలిపోతాయి. అసలు అలా ఎందుకు జరిగింది? చివరకు ఏమైందనే ప్రశ్నలు ఉండిపోతాయి.

సినిమాలో చూపించిన అనంతమైన పసుపు గదుల్ని గ్రాఫిక్స్‌లో కాకుండా నిజంగానే సృష్టించారు. అసలు ఇవన్నీ ఎలా తయారు చేశారు? అసలు ఇలాంటి ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చిందా? అని సందేహం కలగకమానదు. ప్రధాన పాత్రలు చేసిన ఎజియోఫర్, రెయిన్స్‌వ్ అద్భుతంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్లు మూడ్‌ని ఎలివేట్ చేసింది. మీరు సరికొత్తగా ఉండే మూవీ ఏదైనా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అసలు మిస్ కావొద్దు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: లోకేశ్‌ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ)

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)