ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు
Breaking News
లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ
Published on Sat, 08/08/2026 - 16:10
ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు నచ్చలేదని అంటున్నారు. దీనితో పాటే 'డిసి' అనే తమిళ డబ్బింగ్ బొమ్మ కూడా రిలీజైంది. ఇందులో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ హీరోగా నటించగా.. అనిరుధ్ సంగీతమందించాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టోరీతో దీన్ని తీశారు. దీనికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సింది. ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)
'తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ నా దగ్గరకు ఓ ఆసక్తికరమైన కథతో వచ్చాడు. నాకు చెప్పాడు. అదే టైంలో నేను చేస్తున్న ఓ సినిమా స్టోరీ.. దీనికి పోలినట్లు ఉండటంతో నేను అది ఓకే చేయలేకపోయాను' అని స్వయంగా విజయ్ దేవరకొండ చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియో బట్టి చూస్తే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా చేస్తున్న టైంలో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ 'డిసి' కథతో విజయ్‌ని కలిశాడు. కానీ సెట్ కాలేదు. దీంతో హీరోగా లోకేశ్ కనగరాజ్‌ని తీసుకున్నారు. అలా రౌడీ హీరో చేయాల్సిన మూవీతో దర్శకుడు లోకేశ్ హీరోగా మారాడు. నటుడిగా తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నాడు. ఒకవేళ విజయ్ దేవరకొండ 'డిసి' చేసుంటే ఎలా ఉండేదో?
ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలతో బిజీగా ఉండగా.. లోకేశ్ కనగరాజ్, అల్లు అర్జున్‌తో తాను తీయాల్సిన #AA23 ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.
(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ)
DC VDK pic.twitter.com/mD6vEUCMEQ
— Telugu Chitraalu ² (@TC_Backup) August 8, 2026
Tags : 1