Breaking News

హీరోగా హిట్‌ కొట్టిన అల్లు అర్జున్‌ దర్శకుడు

Published on Sat, 08/08/2026 - 09:10

పక్కా మాస్‌ కమర్షియల్‌ కథాచిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌. మానగరం చిత్రం ద్వారా దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తొలి చిత్రంతోనే కమర్షియల్‌గా హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత కార్తీ హీరోగా ఖైదీ, విజయ్‌ కథానాయకుడిగా మాస్టర్‌, లియో, కమలహాసన్‌ హీరోగా విక్రమ్‌, రజనీకాంత్‌ హీరోగా కూలి వంటి భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రాలను తెరకెక్కించి.. ఇది తన బాణి అని తెలియజేశారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడుగా పాన్‌ ఇండియా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

(చదవండి: లోకేశ్‌ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ కథానాయకుడిగా అవతారం ఎత్తి నటించిన చిత్రం డీసీ. ఈ చిత్రం కూడా ఆయన గత చిత్రాల స్థాయిలోనే పగ, ప్రతీకారం వంటి అంశాలతో ఫుల్‌ మాస్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందింది. ఇందులో లోకేశ్‌ కనకరాజ్‌ ఒక గ్యాంగ్‌ స్టర్‌గా నటించారు. ఈయన పోలీసులకే పెద్ద సవాల్‌గా మారతాడు. అసలు ఈయన ఎందుకు తుపాకీ, కత్తులను చేతపట్టాల్సి వచ్చింది? పోలీసులపై ఎందుకు కక్ష కట్టాల్సి వచ్చింది? ఈయన తన తండ్రి తనకు కొడుకే లేడు అన్నంతగా నైరాశ్యానికి ఎందుకు గురయ్యాడు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం డీసీ. 

సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ భారీ యాక్షన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రానికి అరుణ్‌ మదేశ్వరన్‌ దర్శకత్వం వహించారు. నటి వామిక గబ్బి, సంజన హీరోయిన్లుగా నటించిన ఇందులో దర్శకుడు కస్తూరి రాజా, తలైవాసల్‌ విజయ్‌, క్రిష్‌ దయాళ్‌, అవినాష్‌దేవన్‌,, జవహర్‌ శక్తి, శరత్‌ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్‌ సంగీతాన్ని, ముఖేష్‌ ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)