Breaking News

Sagubadi: ఏఐతో తెగుళ్లకు చెక్‌!

Published on Tue, 08/04/2026 - 05:05

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత నూతన దారులు చూపుతోంది. పంటలకు సోకే తెగుళ్లను ఆరంభ దశలోనే గుర్తించి, సరైన నివారణో΄ాయాలు సూచించేలా హైదరాబాద్‌లోని ‘విఎన్‌ ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’ పరిశోధకులు ఒక అత్యాధునిక ఏఐ వ్యవస్థకు రూపకల్పన చేశారు.

కన్వొల్యూషనల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించి ఆకుల తెగుళ్లను గుర్తించే విధా రూపొందించారు. ఈ ఆవిష్కరణను సీఎస్‌ఈ విభాగానికి చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ ్ర΄÷ఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌ విజయ సరస్వతి మరో 9 మంది పరిశోధకులతో కలసి రూపొందించిన ఈ సాంకేతికతకు భారత ప్రభుత్వ పేటెంట్‌ లభించింది. పంటలకు వచ్చే రకరకాల తెగుళ్లను సకాలంలో గుర్తించకపోవటం వల్ల రైతులు ప్రతి సంవత్సరం తీవ్ర దిగుబడి నష్టాన్ని చవిచూస్తున్నారు.

టొమాటో, బంగాళాదుంప, క్యాప్సికమ్‌ పంటలకు చెందిన 20 వేల ఆకుల చిత్రాల డేటాసెట్‌ను ఉపయోగించి వీఎన్‌ ఆర్‌ వీజీఐఈటీ నిపుణులు పరిశోధన చేశారు. పంటల్లో సాధారణంగా కనిపించే ప్రధాన తెగుళ్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఏఐ వ్యవస్థ పంట ఆకుల చిత్రాలను విశ్లేషించి 97.7% కచ్చితత్వంతో ఆరంభ దశలోనే తెగుళ్లను పసిగడుతుంది. అంతేకాకుండా, ఆ తెగులు నివారణకు వాడాల్సిన తగిన క్రిమిసంహారక మందులను కూడా సూచిస్తుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ, పరాగసంపర్కం, మొక్క పెరుగుదల దెబ్బతినక ముందే జాగ్రత్తపడొచ్చని డా. విజయ సరస్వతి తెలి΄ారు.

రైతులకు త్వరలోనే అందుబాటులోకి..!
నేను రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. పంటలను ఆశించే తెగుళ్లను ఆలస్యంగా గుర్తించటం వల్ల ఎకరాలకు ఎకరాలు పంట నాశనమై రైతులు పడే ఆవేదనను దగ్గర్నుంచి చూశాను. ఆ అనుభవమే ఈ పరిశోధనకు పునాది వేసింది. ప్రస్తుతం వెబ్‌ ఇంటర్‌ఫేస్‌లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నాం. ఇది త్వరలోనే రైతులకు అందుబాటులోకి వచ్చి పంట నష్టాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నాను.
– డాక్టర్‌ విజయ సరస్వతి, వీఎన్‌ ఆర్‌ వీజీఐఈటీ, ప్రధాన పరిశోధకురాలు

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌ 

Videos

NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు

తమాషాలు చేస్తున్నారా? పోలీసులపై అమర్నాథ్ ఫైర్!

తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం

భారత్‌పై వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన Mark Zuckerberg

హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ 8 కాలేజీలు క్లోజ్

జగన్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు

దుబాయ్ గుండెలపై మిస్సైళ్ళ వరం

క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?

రెండేళ్లలో మీ వల్ల జరిగింది ఇదే.. ! PIB రిపోర్ట్ చదివి వినిపించిన YS జగన్

Photos

+5

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్..(ఫొటోలు)

+5

బ్లూ శారీలో టాలీవుడ్ నటి అనసూయ అందాలు (ఫొటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ దేవరపల్లి పర్యటన.. ప్రజలు బ్రహ్మరథం (ఫొటోలు)

+5

అందాల ఆషికా రంగనాథ్ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

'వారణాసి' షూటింగ్ చేసిన చోట 'దృశ్యం' పాప (ఫొటోలు)

+5

బన్నీ 'వరుడు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)

+5

హ హ హాసిని బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టిన తెలుగుగమ్మాయి.. ఈషా రెబ్బా (ఫొటోలు)