BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?
Breaking News
థియేటర్లలో శ్రీనివాస మంగాపురం.. ఓటీటీల్లో ఒక్క రోజే 14 సిినిమాలు
Published on Thu, 07/30/2026 - 22:20
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ రోజే శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ వారాంతంలో ఈ రెండు చిత్రాలతో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, సిగ్మా, 418 లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన రావు బహదూర్, దీవానా, పోలీస్ కంప్లైంట్ లాంటి చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్ఫ్లిక్స్..
రావు బహదూర్(తెలుగు మూవీ)- జూలై 31
గట్ట కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31
ఆవోసి(జపనీస్ సిరీస్)- ఆగస్ట్ 01
చికాగో పీడీ(హాలీవుడ్ సిరీస్)- ఆగస్ట్ 01
మైఖేల్ పెంబురు దువా ఆలమ్- ఆగస్ట్ 02
అమెజాన్ ప్రైమ్
పోలీస్ కంప్లైంట్(తెలుగు సినిమా)- జూలై 31
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31
బ్యాట్మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31
జియో హాట్స్టార్
భోజ్పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02
ఆహా
దీవానా (తెలుగు సినిమా) - జూలై 31
జీ5
బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31
అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31
హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31
వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 (రూమర్ డేట్)
సోనీ లివ్
ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31
సన్ నెక్ట్స్..
పైతాలట్టం(మలయాళ సినిమా)- జూలై 31
లయన్స్ గేట్ ప్లే..
చుమ్(హాలీవుడ్ మూవీ)- జూలై 31
హెచ్బీవో మ్యాక్స్..
ది డ్రామా(హాలీవుడ్ మూవీ)- జూలై 31
Tags : 1