Breaking News

అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!

Published on Mon, 07/27/2026 - 21:02

విద్యారంగంలో ప్రస్తుతం అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ పేపర్ లీక్స్, పరీక్షల రద్దు, విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యలు వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవన్నీ.. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుత సమస్య నీట్ (NEET) కాదు, అసలు సమస్య ఏఐ (AI) అని పేర్కొన్నారు.

విద్య అంటే..
గతంలో విద్య అంటే.. ఒక వ్యక్తికి అవసరమైన జ్ఞానాన్ని అందించి, ఉద్యోగానికి సిద్ధం చేయడం. డాక్టర్, ఇంజనీర్, లాయర్ వంటి వృత్తులకు కావాల్సిన విషయాలను నేర్చుకుని, ఒక స్థిరమైన జీవితాన్ని గడపడం అనేది చాలామంది లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

ఒకప్పుడు సమాచారం పొందడం కష్టంగా ఉండేది. పుస్తకాలు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞుల ద్వారా మాత్రమే జ్ఞానం లభించేది. కానీ ఈ రోజు ఏదైనా సమాచారం కావాలంటే.. ఇంటర్నెట్, ఏఐ వంటి వాటిమీద ఆధారపడుతున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా.. ప్రపంచంలోని సమాచారం మన చేతుల్లోకి వచ్చేసింది. అయితే ఈ సమాచారంలో నిజమైన అంశాలు మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారం కూడా ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు.

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు
ఏఐ అనేది కేవలం సమాచారాన్ని అందించడానికి మాత్రమే కాకుండా.. మనుషులు చేసే అనేక పనులను వేగంగా చేయగల స్థాయికి చేరుకుంటోంది. రాయడం, విశ్లేషించడం, కోడింగ్ చేయడం, డిజైన్ చేయడం వంటి పనుల్లో ఏఐ దూసుకెళ్తోంది. దీంతో భవిష్యత్తులో విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదనే అభిప్రాయం బలపడుతోంది. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఏఐ తీవ్రత ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.

అందుకే.. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు.. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒకప్పుడు బాగా చదువు.. మంచి ఉద్యోగం సంపాదించు.. జీవితాంతం భద్రంగా ఉండు అనే ధోరణి ఉండేది. కానీ ఏఐ యుగంలో ఎప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియదు.

ఉద్యోగాలు పోతాయా?
ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని అర్థం ఈ రంగాల్లో ఉన్న ఉద్యోగాలు పూర్తిగా పోతాయని కాదు. కానీ ఆ రంగాల్లో పనిచేసే విధానం మారుతుంది. ఏఐని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే వారికి ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఏఐని ఎలా ఉపయోగించాలి, దానితో కలిసి ఎలా పని చేయాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి వంటి నైపుణ్యాలను తప్పకుండా నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును కేవలం ర్యాంకులు, మార్కులు, డిగ్రీలతో మాత్రమే అంచనా వేయకుండా, వారు మారుతున్న ప్రపంచానికి ఎంతగా సిద్ధంగా ఉన్నారో చూడాలి.

ఇదీ చదవండి: కియోసాకి వ్యూహం.. రియల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ!

#

Tags : 1

Videos

ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!

మీకు ఆ దమ్ముందా..? చంద్రబాబుకు బోండా ఉమా కౌంటర్

ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు..! హైదరాబాద్ లో కొత్త AI కెమెరాలు

విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం

హైడ్రా ముసుగులో రియల్ ఎస్టేట్ దందా..

High Court: సీఎం రేవంత్‌కు చెంప దెబ్బ

16 డిమాండ్లతో కార్మికుల పోరు! ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటమే..!

తిరుపతిలో జనసేన నాయకుడు ఆత్మహత్య

అస్మిత్ రెడ్డిపై షాకింగ్ ఆరోపణలు.. ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

Photos

+5

ISSF World Cup: అదరగొట్టిన భారత షూటర్లు.. సింగ్‌కు స్వర్ణం, మనుకు కాంస్యం (ఫొటోలు)

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)