డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
సీఎం సినిమాకే తప్పని తిప్పలు.. షోలు ఆపేసి మరీ
Published on Mon, 07/27/2026 - 13:43
తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్'.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులో మాత్రం అభిమానులు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే చెన్నైలోని పలు థియేటర్లలో ఈ మూవీ షోలని మధ్యలోనే నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది.
(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)
వయలెన్స్ ఉందనే కారణంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా సరే కొందరు ప్రేక్షకులు తమతోపాటు చిన్న పిల్లల్ని కూడా థియేటర్లకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం చెన్నైలోని పలు మల్టీప్లెక్స్‌ల్లో జరిగిన పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఇది రూల్స్‌కి విరుద్ధం కావడంతో షోలు ఆపేశారు.
ఈ క్రమంలోనే పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులని థియేటర్లలో నుంచి బయటకు పంపేందుకు దాదాపు గంట పట్టింది. ఫలితంగా కొన్నిచోట్ల షోలు ఆలస్యమయ్యాయి. మరోసారి నిబంధనలని గుర్తుచేస్తూ మైనర్లతో వచ్చేవాళ్లని మల్టీప్లెక్స్‌ల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశాయి.
తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా దీన్ని తీశారు. అసలైన పాయింట్ తీసుకుని మిగతాది అంతా యాక్షన్‌తో నింపేశారని, దీంతో వరస్ట్‌గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజవ్వాలి కానీ సెన్సార్ సమస్యలని దాటుకుని గత వీకెండ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
(ఇదీ చదవండి: నా కథ, స్క్రీన్‌ప్లే దొంగిలించారు)
Tags : 1