డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
నా కథ, స్క్రీన్‌ప్లే దొంగిలించారు
Published on Mon, 07/27/2026 - 13:00
నా కథ, స్క్రీన్‌ప్లేని దొంగిలించి, నేను రూపొందించిన ప్రాజెక్ట్ నుంచి తప్పించారంటూ ఓ సినీ రచయిత ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన భూక్య ప్రభుదేవ్ రూపొందించిన 'మణిమా–ది శూన్య పురుష–ది లార్డ్ పూరి జగన్నాథ్' మైథాలజీ సినిమాకు సంబంధించిన కథ, స్క్రీన్‌ప్లే, టైటిల్ గ్లింప్స్ ని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
సినిమా పనుల కోసం తనతో పనిచేసిన పి.రవి, కో డైరెక్టర్ నవీన్ నలమాసని ప్రభుదేవ్ నియమించుకున్నారు. వీరు అజిత్ కుమార్‌తో కలిసి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, ఫైల్స్‌ను, హార్డ్‌డిస్క్ దొంగిలించారని, అందులోని కథని ఉపయోగించి తనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి.. రచయిత, దర్శకులుగా గుర్తింపు పొందడానికి ప్రయత్నించారని ప్రభుదేవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)
Tags : 1