LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్
Breaking News
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
Published on Fri, 07/24/2026 - 10:48
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈమె గతంలో 'కలివనం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. గతేడాది ఇది థియేటర్లలో ఆపై ఓటీటీలోకి వచ్చింది గానీ జనాలకు దీని గురించి అస్సలు తెలీదు. అయితే ఈమె రీసెంట్‌గా తమిళంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ మేనల్లుడు మూవీలో చేసింది. ఇప్పుడీ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)
నాగదుర్గ తమిళంలో చేసిన తొలి సినిమా 'లవ్ ఓ లవ్'. పవిష్ హీరో. ఈ నెల 10న తమిళంతో పాటు తెలుగులనూ రిలీజైంది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు.. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.
'లవ్ ఓ లవ్' విషయానికొస్తే.. రఘు(పవిష్), అవంతిక(నాగదుర్గ)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అయితే ప్రేమలో పడిన తర్వాత సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో రఘు డబ్బులన్నీ అవంతిక అవగొట్టేస్తుంది. చివరుు క్రెడిట్ కార్డులు, అప్పులు తీసుకునేలా చేస్తుంది. కానీ కొన్నాళ్ల తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన రఘు.. అవంతిక తనకు లవ్, రఘు వద్దని ఓ బ్రేకప్ లెటర్ మీద సంతకం పెట్టాలని లేదంటే ప్రేమలో తనకు చేసినవన్నీ ఓ నాలుగు నెలలు తన స్థానంలో ఉండి తను చేసినవన్నీ చేయాలని అడుగుతాడు. దీంతో అవంతిక రఘుని చూసుకుంటానని చెబుతుంది. తర్వాత ఏమైంది? ఈ క్రమంలో అవంతిక ఎదుర్కున్న ఇబ్బందులేంటి? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.
ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజైన సినిమాల విషయానికొస్తే నాగబంధం, పురుషః లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి తదితర డబ్బింగ్ చిత్రాలు.. ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)
Tags : 1