Breaking News

‍'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?

Published on Fri, 07/24/2026 - 10:21

స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన చివరి సినిమా 'జన నాయగన్'. లెక్క ప్రకారం సీఎం కాకముందే అంటే ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు నిన్న(జూలై 23) థియేటర్లలో రిలీజైంది. తమిళంలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు గానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. మరి ఈ మూవీకి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసిన 'జన నాయగన్' చిత్రానికి తొలిరోజు రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.41 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. గ్రాస్ రూ.48.27 కోట్లుగా తేలింది. ఓవర్సీస్ నుంచి రూ.30 కోట్లు వచ్చాయి. ఇలా ఓవరాల్‌గా రూ.78.27 కోట్ల గ్రాస్ అని టాక్. ఇందులో హిందీ నుంచి రూ.1.75 కోట్లు తెలుగు నుంచి రూ.2.75 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మిగతాది అంతా తమిళ ప్రేక్షకుల నుంచే వచ్చింది.

అయితే విజయ్ చివరి సినిమా అని హడావుడి చేసినప్పటికీ గతంలో వచ్చిన 'గోట్' తొలిరోజు కలెక్షన్స్‌ని 'జన నాయగన్' అధిగమించలేదని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న నంబర్స్ మాత్రమే. నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే వసూళ్లపై క్లారిటీ వస్తుంది.

(ఇదీ చదవండి: చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్)

'జన నాయగన్' విషయానికొస్తే.. దళపతి వెట్రి కొండాన్ (విజయ్) జైలులో ఉంటాడు. తనతో పాటు ఖైదీగా ఉన్న ఓ వ్యాపారవేత్తని కాపాడి జైలర్ (గౌతమ్ మేనన్‌) దృష్టిలో పడతాడు. ఆ అధికారి సాయంతోనే క్షమాభిక్ష కింద వెట్రి బయటకొస్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆయన కూతురు విజ్జి (మమిత బైజు)ని పెంచే బాధ్యతని వెట్రి తీసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యని కళ్లారా చూసిన విజ్జి ప్రతి చిన్న విషయానికీ భయంతో వణికిపోతుంటుంది. ఆమెను ధైర్యవంతురాలిగా మార్చి, సైన్యంలో చేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు.

మరోవైపు జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని లక్ష్యంగా చేసుకుని ఆమెని చంపాలని తన ముఠాని పంపుతాడు. అసలు విజ్జిని జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేంటి? ఆఫ్రికా దేశాల్ని వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతడిని వెట్రి కొండాన్ ఎలా ఎదిరించాడు? విజ్జిలోని భయాన్ని పోగొట్టి ఆమెని ధైర్యవంతురాలిగా మార్చాడా?లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్

రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?

వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL

SMలో వీడియో వైరల్.. GEN-Z డేరింగ్ లేడీ.. మహిళా కానిస్టేబుల్ తో ఫైట్

అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!

మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్

గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు

ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది . ఇప్పుడే చెప్పలేం... అసలు కథ ముందుంది

అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు

పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?

Photos

+5

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కొత్త లోకా బ్యూటీకి బిగ్‌ ఛాన్స్‌.. ఏకంగా దురంధర్‌ హీరోతో..! (ఫోటోలు)

+5

ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

+5

'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)

+5

బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)

+5

అందాల బొమ్మలా యంగ్ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)

+5

నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)