Breaking News

మీ మనసుని అర్థం చేసుకునే రోబో

Published on Mon, 07/20/2026 - 13:47

నేటి ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. మనుషుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతున్న ఈ తరుణంలో సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ UBTECH తన వినియోగదారు బ్రాండ్ కింద UWORLD U1 అనే హ్యూమనాయిడ్ కంపానియన్ (సహచర) రోబోను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయగల అల్ట్రా-బయోనిక్ రోబోగా ఇది రికార్డు సృష్టించింది.

మనిషికి ప్రతిరూపం

  • ఈ రోబో కేవలం యంత్రంలా కాకుండా అచ్చం మనిషి లాంటి రూపాన్ని, హావభావాలను కలిగి ఉంటుంది.

  • మనిషి స్పర్శను తలపించేలా బయోమిమెటిక్ సిలికాన్ చర్మంతో దీనిని రూపొందించారు. దీనికి మేకప్ వేయడం, జుట్టును అమర్చడం కూడా సాధ్యమే.

  • మనుషుల శారీరక కదలికలను 90 శాతం వరకు అనుకరించేందుకు ఇందులో 88 సర్వో జాయింట్లు, ప్రత్యేక మెడ భాగం అమర్చారు.

  • కేవలం మాట్లాడటమే కాదు, మనుషుల వాయిస్ టోన్, ముఖ కవళికలను బట్టి వారి మానసిక స్థితిని 90% కచ్చితత్వంతో గ్రహించి దానికి తగ్గట్టుగా ఓదార్పు మాటలు చెప్పగలదు.

  • ఈ రోబో వంట చేయడం, ఇల్లు ఊడ్చడం వంటి గృహ పనులు చేయదు. కేవలం ఒక మంచి స్నేహితుడిలా సంభాషించడం, మందుల వేళలను గుర్తు చేయడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మానసిక ఉల్లాసాన్ని అందించడమే దీని ఉద్దేశం.

  • చైనాలో ఒంటరిగా ఉంటున్న దాదాపు 12 కోట్ల మంది సింగిల్స్, 32 కోట్ల మందికి పైగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు.

ధర ఎంతంటే..

ఈ రోబోల ప్రారంభ ధర 1,19,800 యువాన్లు (సుమారు రూ. 14 లక్షలు) కాగా, అత్యంత అధునాతన ఫీచర్లు గల ఆల్ట్రా వెర్షన్ ధర 9,90,000 యువాన్ల (సుమారు రూ. 1.15 కోట్లు) వరకు ఉంది. ఖరీదైన మోడల్స్‌లో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా లేదా గతంలో మరణించిన తమ ప్రియమైన వారి ముఖ రూపాలను (3డీ ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్, వాయిస్‌ప్రింట్ ద్వారా) రీ-క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.

మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి రోజే ఈ సిరీస్ కోసం ఏకంగా 13,361 యూనిట్ల ప్రీ-ఆర్డర్లు రావడం గమనార్హం. దీని డెలివరీలు రాబోయే సెప్టెంబర్ మధ్య నాటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మానవ సంబంధాల కొరతను ఎంతవరకు తీరుస్తాయో వేచి చూడాలి.

ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?

Videos

30 సంవత్సరాల నుంచి TDP అంటే ప్రాణమిచ్చా.. టీడిపీ నేత సంచలన వ్యాఖ్యలు

ట్రైనీ IPS ఉదయ్ కేసులో కీలక మలుపు

వివస్త్రను చేసి.. మూత్రం పోసేలా కొట్టి.. కాస్తయినా సిగ్గుండాలి..

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)