ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు
Breaking News
ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. ట్రైలర్ రిలీజ్
Published on Wed, 07/15/2026 - 15:11
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా ప్రీతమ్ అండ్ పెడ్రో, సూపర్ సుబ్బు తదితర సిరీస్లు సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నాయి. వీటిలానే ఎంటర్టైన్ చేసేందుకు ఓ రొమాంటిక్ డ్రామా సిరీస్ రెడీ అయింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)
విక్రాంత్ మస్సే, వేదిక పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ముసాఫిర్ కేఫ్'. దివ్య ప్రకాశ్ దూబే అనే రచయిత్రి రాసిన 'ముసాఫిర్ కేఫ్' నవల ఆధారంగా ఈ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కించారు. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 24 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.
'ముసాఫిర్ కేఫ్' ట్రైలర్ బట్టి చూస్తే.. చందర్(విక్రాంత్ మస్తే) కుర్రతనంలో ఉన్నప్పుడు సుధ(వేదిక పింటో)ని ప్రేమిస్తాడు. రిలేషన్లోకి వెళ్తాడు. కానీ కొన్ని కారణాలతో వాళ్లు విడిపోతారు. కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత చందర్.. ప్రీతి(మహిమా మక్వానా)తో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైంది? ప్రీతికి సుధ గురించి తెలిసినప్పుడు చందర్ ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
Tags : 1