రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!
Published on Fri, 07/03/2026 - 15:46
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్ఫుల్ అండర్‌వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే షూట్‌కు ప్యాకప్ చెప్పనున్నారు. ఇదిలా ఉండగా హీరో నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫోటోల్లో వింటేజ్ లుక్‌తో వింటేజ్ హెయిర్ లుక్‌లో సరికొత్త అవతారంలో కనిపించాడు. అయితే ఈ ఫోటోల్లో నాని ఎడమచేతికి బ్యాండేజ్‌తో కనిపించారు. అదే ఇప్పుడు చర్చకు దారితీసింది.
తన ఫోటోలకు హిందీలో క్యాప్షన్ రాసుకొచ్చారు. 'నేను గాయపడ్డా… అందుకే మరింత ప్రమాదకరంగా మారా' అంటూ ధురందర్ డైలాగ్‌తో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్యారడైజ్ మూవీ షూట్లోనే నానికి గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం నాని డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం వల్లే ఈ గాయాలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తనకు దెబ్బ తగిలినప్పటికీ.. రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారని టాక్. ఈ ఫోటోలు చూస్తుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేయాలనే కసి నానిలో కనిపిస్తోందని.. ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతలా ప్రాణం పెట్టి నటిస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags : 1