Breaking News

ఏఐ సంచలనం ‘ఆంథ్రోపిక్‌’లో రూ.కోట్ల జీతాలు..

Published on Sat, 06/27/2026 - 11:25

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌ (Anthropic) తన ఉద్యోగులకు కోట్ల రూపాయల వేతన ప్యాకేజీలు అందిస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. క్లాడ్ (Claude), మైథోస్ (Mythos) వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థలో కొందరు సాంకేతిక ఉద్యోగుల వార్షిక ప్రాథమిక వేతనం (Base Salary) ఏకంగా 13 కోట్ల రూపాయల వరకు ఉండటం చర్చనీయాంశమైంది. ఇవి కేవలం బేస్ పే మాత్రమే. బోనస్‌లు, స్టాక్‌ ఆప్షన్లు (Equity) ఇందులో లేవు.

ఇటీవల ముగిసిన భారీ నిధుల సమీకరణ తర్వాత ఆంథ్రోపిక్‌ విలువ 965 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఓపెన్‌ఏఐను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ ఏఐ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. కొత్తగా సమీకరించిన నిధులను కంప్యూటింగ్‌ సామర్థ్యాల పెంపు, అధునాతన ఏఐ మోడళ్ల అభివృద్ధి, భద్రతా పరిశోధనల కోసం వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.

హెచ్‌-1బీ దరఖాస్తులతో వెలుగు చూసిన జీతాలు

అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల ఆధారంగా ఈ వేతన వివరాలు బయటకు వచ్చాయి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ విశ్లేషణ ప్రకారం, "మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌" హోదాలో ఉన్న ఇద్దరు ఉద్యోగులకు వరుసగా 1.12 మిలియన్ డాలర్లు, 1.38 మిలియన్ డాలర్ల వార్షిక బేస్‌ పే నమోదు అయింది. అయితే ఈ హోదాను సంస్థ వివిధ సాంకేతిక విభాగాల్లో ఉపయోగిస్తుండటంతో వారి ఖచ్చితమైన బాధ్యతలు వెల్లడికాలేదు. అలాగే ఈ గణాంకాల్లో స్టాక్‌ అవార్డులు, పనితీరు బోనస్‌లు చేర్చలేదు.

హెచ్‌-1బీ దరఖాస్తుల ప్రకారం ప్రధాన విభాగాల్లో వార్షిక బేస్‌ పే ఇలా ఉంది..

  • మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌: రూ.1.26 కోట్లు – రూ.13.02 కోట్లు

  • మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ (మేనేజర్‌): రూ.1.26 కోట్లు – రూ.8.02 కోట్లు

  • రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ రీసెర్చర్‌: రూ.1.06 కోట్లు – రూ.4.71 కోట్లు

  • ప్రొడక్ట్‌ డిజైన్‌ మేనేజర్‌: రూ.1.32 కోట్లు – రూ.3.60 కోట్లు

  • ప్రొడక్ట్‌ ఆపరేషన్స్‌: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లు

  • అకౌంటింగ్‌: రూ.1.33 కోట్లు – రూ.2.17 కోట్లు

  • కమర్షియల్‌ కౌన్సెల్‌: రూ.1.87 కోట్లు – రూ.3.01 కోట్లు

  • ఫైనాన్స్‌ అండ్‌ స్ట్రాటజీ: రూ.1.72 కోట్లు – రూ.2.92 కోట్లు

  • మార్కెటింగ్‌: రూ.1.50 కోట్లు – రూ.1.88 కోట్లు

  • రిసెర్చ్‌ ఆపరేషన్స్‌: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లు

  • టెక్నికల్‌ సేల్స్‌: రూ.1.46 కోట్లు – రూ.4.71 కోట్లు

టాలెంట్‌ కోసం పోటీ

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై అనిశ్చితి కారణంగా అనేక కంపెనీలు నియామకాలను తగ్గిస్తున్నప్పటికీ, ఆంథ్రోపిక్‌, ఓపెన్‌ఏఐ, ఎన్విడియా వంటి ఏఐ సంస్థలు మాత్రం అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనే ఆంథ్రోపిక్‌ సుమారు 80 హెచ్‌-1బీ ఉద్యోగాలకు సర్టిఫికేషన్‌ పొందినట్లు సమాచారం. అత్యున్నత స్థాయి వేతనాలతో పాటు భారీ స్టాక్‌ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ఉద్యోగులను సంస్థలోనే కొనసాగించే వ్యూహాన్ని ఆంథ్రోపిక్‌ అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)