TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
Breaking News
మోదీని కలిసిన అమెజాన్ సీఈఓ: కీలక ప్రకటన!
Published on Thu, 06/25/2026 - 15:10
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటి. అందుకే.. దిగ్గజ సంస్థలు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా అదే బాటలో మరో అడుగేసింది.
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తన భారత పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా.. 2030 నాటికి భారతదేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అమెజాన్ 2025 డిసెంబర్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.
కొత్త పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. "మేము దశాబ్దానికి పైగా కాలంగా భారతదేశంలో పనిచేస్తున్నాం. ఈ కామర్స్, క్లౌడ్, ఏఐ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని చూశాం. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత పెట్టుబడి పెడుతున్నాం" అని చెప్పారు.
అమెజాన్ లక్ష్యం.. కేవలం వ్యాపారం పెంచుకోవడం మాత్రమే కాదు. భారతదేశంలో చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా.
అమెజాన్ పెట్టుబడులతో 2030 నాటికి భారతదేశంలో.. 38 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు లభించనున్నాయి. 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులకు సహకారం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలు ఏఐ ప్రయోజనాలు పొందనున్నారు. పైగా 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించనుంది.
ఇదీ చదవండి: భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!
అమెజాన్ కంపెనీ తన పెట్టుబడిలో భారీ మొత్తాన్ని ఏఐ, క్లౌడ్ రంగానికే కేటాయించనుంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్, ముంబైలలో ఉన్న ఏడబ్ల్యుఎస్ డేటా సెంటర్లను మరింత విస్తరించనుంది. దీని వల్ల భారతీయ కంపెనీలు తమ డేటాను దేశంలోనే భద్రంగా నిల్వ చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోగలుగుతాయి.
ఇప్పటికే అనేక భారతీయ సంస్థలు ఏడబ్ల్యుఎస్ సేవలను ఉపయోగిస్తున్నాయి. ఇందులో బ్యాంకులు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అమెజాన్ తాజా ప్రకటన.. భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు, సాంకేతిక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇది ''డిజిటల్ ఇండియా'' లక్ష్యాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే మరో కీలక అడుగుగా చెప్పవచ్చు.
Really enjoyed my meeting with Prime Minister @narendramodi about what’s ahead for Amazon in India.
We’ve been serving customers, sellers, developers, startups, and enterprises in India for more than a decade and just getting started.
Shared that we’re investing $48 billion… pic.twitter.com/CSiwPTiEBh— Andy Jassy (@ajassy) June 25, 2026
Tags : 1