Breaking News

మెటా షాక్.. ఉద్యోగుల డేటా లీక్!

Published on Tue, 06/23/2026 - 18:45

ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.

మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్‌ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్‌లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.

ప్రైవేట్ చాట్స్ లీక్
ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్‌క్రిప్షన్‌లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్‌ను ఆపేసింది. అయితే.. ఈ లీక్‌పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్‌కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.

ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం
నిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్‌ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు!

Videos

సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ

బట్టల్లేకుండా రక్తపుమడుగులో గాయత్రి ఆరోజు అర్ధరాత్రి HOTEL లో..!

60 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు బ్రేక్

బిగ్ షాక్ ఇచ్చిన త్రిష - విజయ్ షేక్ అవుతున్న తమిళనాడు

ఆ తల్లి బూడిద అడిగితే... ఏ కులం అంటు..!

JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన

క్రాంతి కుమార్ ఇంటికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల బృందం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు

CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం

Photos

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)