5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!
Breaking News
పెద్దిలో కొత్త సీన్స్.. ఎన్ని నిమిషాలు.. థియేటర్లలో ఎప్పుడంటే?
Published on Thu, 06/18/2026 - 07:07
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇప్పటికే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సౌతిండియా సినిమాగా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే జాన్వీ కపూర్ సీన్స్‌పై వివాదం రావడంతో పెద్ది మేకర్స్ సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఆ సీన్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ బుచ్చిబాబు కొత్త వాటిని యాడ్ చేస్తామని ప్రకటించారు. కానీ అవీ ఎప్పటి నుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయాన్ని పెద్ది మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎన్ని నిమిషాల సీన్స్ కొత్తగా యాడ్ చేస్తున్నామనే విషయాన్ని ప్రకటించారు.
పెద్ది అభిమానులకు మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ కొత్తగా దాదాపు ఐదు నిమిషాల 56 సెకన్ల పాటు కొత్త సన్నివేశాలు యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సీన్స్ నేటి నుంచే థియేటర్లలో సందడి చేస్తాయని వెల్లడించారు.
ఇప్పటికే కొత్త సన్నివేశాలకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి కావడంతో పెద్ది మూవీకి లైన్ క్లియర్ అయింది. దీంతో గురువారం నుంచి అదనంగా వచ్చిన సన్నివేశాలతో పెద్ది రన్ కానుంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
రూ. 500 కోట్ల క్లబ్‌లో పెద్ది..?
ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న పెద్ది బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్ సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా సీన్స్ రావడంతో ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వెళ్లే ఛాన్స్ ఉంది. అందువల్లే మేకర్స్ కూడా పక్కా ప్లాన్‌తోనే ఈ సన్నివేశాలను కాస్తా ఆలస్యంగా థియేటర్లకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసమైనా అభిమానులు, సినీ ప్రియులు మరోసారి పెద్దిని చూసేందుకు ఆసక్తి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే పెద్ది రూ.500 కోట్ల మార్క్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాగా.. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఆకట్టుకుంది.
The #Peddi experience gets better 🤩
5 mins 56 seconds of new scenes will be added from tomorrow in theatres.
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/N91oIPEYdR— PEDDI (@PeddiMovieOffl) June 17, 2026
Tags : 1