నైజర్‌లో ఉగ్రదాడి.. 13 మంది మృతి
Breaking News
ఒకే కారులో ఇద్దరు మాజీలు, ప్రియురాలు.. ఇదెలా సాధ్యం..!
Published on Wed, 06/17/2026 - 13:08
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వచ్చే నెలలోనే పెళ్లాడనున్నారు. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కనున్నారు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా బెంగళూరుకు చెందిన తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో జూలై 5న పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అమిర్ ఖాన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే. మొదట రీనా దత్తాను పెళ్లాడిన ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును ఆయన పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకు వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు.
ముచ్చటగా మూడోసారి తన ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్‌రావు, ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి ఓకే కారులో కనిపించారు. అమిర్ ఖాన్ ముందు సీటులో కూర్చోగా ముగ్గురు వెనక సీటులో కూర్చుని ప్రయాణించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు భార్యలతో కనిపించడం ఏ స్టార్ హీరోకు సాధ్యం కాదంటూ పోస్టులు పెడుతున్నారు.
Dear women if you love Amir Khan? then let your husband be like him.#amirkhan pic.twitter.com/JK3NtDPJOA
— Echoles By Sushil Singh (@EcholesBySushil) June 17, 2026
Tags : 1