Breaking News

22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు

Published on Mon, 06/15/2026 - 20:53

తమిళ‍నాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్‌కి చెందిన చాలామంది విజయ్‌ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్‌గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్‌తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్‌ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్‌ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్‌తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్)

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)