AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
Breaking News
నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
Published on Mon, 06/15/2026 - 12:11
అలా వైకుంఠపురములో, బ్రోచేవారెవరురా, పాగల్, రెడ్ లాంటి టాలీవుడ్ సినిమాల్లో అలరించిన బ్యూటీ నివేదా పేతురాజ్. 2023లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీలో కనిపించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన సింగ్ గీతంలో మెరిసింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమో అనుకున్నాననని తెలిపింది. 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. ఆ తర్వాత నుంచి తన ప్లాన్ అంతా రాంగ్ రూట్‌లోనే వెళ్లిందని చెప్పుకొచ్చింది.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సింగ్ గీతంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చానని ఆనందం వ్యక్తం చేసింది. కానీ నాగ్ అశ్విన్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది. లేదంటే ఇప్పటికే హిమాలయాల్లో ఉండేదాన్నేమోనని కామెంట్స్ చేసింది. కాగా.. ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీకి 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా.. నాగ్ అశ్విని నిర్మించారు.
చదవండి: పెళ్లి రద్దుపై తొలిసారి స్పందించిన హీరోయిన్
Tags : 1