Breaking News

చరణ్‌-జాన్వీల ముద్దు సీన్‌పై విమర్శలు... స్పందించిన బుచ్చిబాబు

Published on Sat, 06/06/2026 - 09:48

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌-జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఈ నెల 4న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. సినిమా చూసినవారంతా గ్లామర్‌ షో కోసమే జాన్వీ కపూర్‌ని పెట్టారని, కథకు ఆమె పాత్రకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. 

ఇక సోషల్‌ మీడియాలో అయితే జాన్వీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతుంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌-జాన్వీల ముద్దు సీన్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఏ సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సీన్‌ పెట్టారంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు.  ముద్దు సీన్‌పై ఇలాంటి నెగెటివ్‌ స్పందన వస్తుందని ఊహించలేదన్నారు.

రామ్‌ చరణ్‌-జాన్వీల మధ్య సరదా సాగే ఓ ప్రేమ కథను మాత్రమే తెరపై చూపించాలనుకున్నామని.. అందులో భాగంగానే ముద్దు సీన్‌ పెట్టామని వివరణ ఇచ్చాడు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని ఇకపై అలాంటి సీన్లను తెరకెక్కించే ముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తన తదుపరి సినిమాల్లో అలాంటి సీన్లు ఉంటే.. ప్రేక్షకులను నచ్చే విధంగా తెరకెక్కిస్తామని తెలిపారు.

పెద్ది విషయానికొస్తే.. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలోని కొండకింద ఊరికి చెందని ఓ యువకుడు.. గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇందులో రామ్‌ చరణ్‌ గిరిజన యువకుడిగా కనిపిస్తూ.. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్‌గా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు.  మొదటి రోజు ఈ చిత్రం రూ. 135 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 

Videos

SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

RCBలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!

జగనే మీ కన్నానయం.. నువ్వు రెండు సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసావ్..

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు

వైరల్ గా మరీనా కేశినేని నాని పోస్ట్, సొంత పార్టీ నేతలను కూడా వదలని కేశినేని చిన్ని

బాబుకు ఇల్లు గిఫ్ట్.. పవన్ కు ల్యాండ్ గిఫ్ట్.. లింగమనేనికి RS సీటు గిఫ్ట్..

యుద్దానికి సిద్ధంగా ఉండు... మా దమ్మెంటో చూపిస్తాం

బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్

Photos

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్‌ సందడి (ఫొటోలు)

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు