SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్
Breaking News
రామ్ చరణ్ బాడీ గార్డ్.. జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
Published on Fri, 06/05/2026 - 21:07
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించింది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే పెద్ది మూవీ సంగతి పక్కనపెడితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి గురించే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ కంటే అతనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ ప్రత్యేక బాడీ గార్డ్ కెవిన్ కుంటా. అతను ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పెద్ది సినిమాతో కెవిన్ కుంటా ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు.
అతనికి ఫేమ్ రావడంపై రామ్ చరణ్ సైతం ఫన్నీగా స్పందించారు. మీరు ఫేమస్ చేసేశారు.. కెవిన్‌ను బయటికి పంపకుండా చేశారంటూ సరదాగా మాట్లాడారు. తాజాగా కెవిన్ కుంటా ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అతను జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కెవిన్ కుంటా డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.
"Like boss, like bodyguard." 😎🔥#MassaMassa pic.twitter.com/tiFrCqMwg3
— ᶠʳᵒᵒᵗʸపెద్ది🦁 (@Mouli_Ka) June 4, 2026
Tags : 1