Breaking News

తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?

Published on Wed, 06/03/2026 - 00:37

మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెద్ది సినిమా టికెట్‌ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్లలో రూ.100, మల్టీఫ్లెక్స్‌లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతిలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జూన్‌ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్‌ ప్రీమియర్‌ షోకి అనుమతిచ్చింది.  స్పెషల్‌ ప్రీమియర్‌ షో టికెట్‌ ధర గరిష్ఠంగా రూ.600 వరకూ ఉండవచ్చని పేర్కొంది. 

ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. దీంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌ రిలీజ్‌ కాగా.. మెగా ఫ్యాన్స్‌ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ హిట్‌ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ ‍కానుందని ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఇక “పెద్ది” సినిమాలో ఓ రీమిక్స్‌ సాంగ్‌ ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. అదే మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరిలోని 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట సినిమాలో ఉందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఆ పాటను సినిమాలో రీమిక్స్‌ చేయలేదు. ఒక సన్నివేశంలో రేడియోలో వినిపించేలా ప్లాన్‌ చేశాం. కానీ ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో దాన్ని మ్యూట్‌ చేసేశామని తెలిపారు.  

Videos

తెలంగాణలో జనసేన ఉంటుంది..!

అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది

భారత్ ను కమ్మేసిన 2500 కిలోమీటర్ల రాకాసి మేఘాలు

నాకు ఏపీలోనే దిక్కు లేదు.. తెలంగాణ లో సీఎం నా ?

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వైభవ్..

ఫైనల్ గా చెప్పేది ఒక్కటే.. మావిగన్ బెస్ట్.. అమరావతి రైతులతో జగన్

ఎండలు రివర్స్ గేర్, భారీ ఈదురు గాలులతో ఏపీకి వానలు

LIVE : అమరావతి రైతులతో వైఎస్ జగన్..

భయపడకండి మీకు నేనున్నా... అమరావతి రైతులకు జగన్ హామీ

మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో అన్నామలై కొత్త ఉద్యమం?

Photos

+5

ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు

+5

చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు)

+5

అల్లు స్నేహా.. మే జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు)

+5

విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌.. అవతరణ అదిరేలా (ఫొటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)

+5

చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)