Breaking News

వాట్ ఏ మూవీ.. రూ.7 కోట్లతో ఏకంగా రూ.950 కోట్లా..!

Published on Sat, 05/30/2026 - 17:37

ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ వసూళ్లు రాబట్టడం చాలా కష్టంగా మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలు సైతం డిజాస్టర్స్‌గా మిగిలిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి టైమ్‌లో ఓ చిన్న సినిమా ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 26 ఏళ్ల యూట్యూబర్‌ రూపొందించిన ఈ హారర్ మూవీ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

2026లో హాలీవుడ్ చరిత్రలో ఊహించని విజయం సాధించిన మూవీ అబ్సెషన్ టేకోవర్. ఈ సినిమాకు  కర్రీ బార్కర్ దర్శకత్వం వహించగా..  మైఖేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్టే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 950 కోట్లు వసూలు చేసింది. అంటే తన బడ్జెట్‌ కంటే వందరెట్లు అధికంగా ఆదాయం రాబట్టింది.  'అబ్సెషన్' ఒక సినిమాటిక్ యూనివర్స్, భారీ విజువల్స్, అతి పెద్ద ఫ్రాంచైజీ, సూపర్‌స్టార్స్ లేకపోయినా ఈ ఘనత సాధించింది.

ఈ వసూళ్లతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రశ్నిస్తోంది. బాలీవుడ్‌లో పెద్దపెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద తేలిపోతున్నాయి. స్టార్స్‌ ఉన్నప్పటికీ వంద కోట్లు వసూల్లు రావడమే గగనంగా మారిపోయింది. హిందీలో ఒక్క దురంధర్ మినహాయిస్తే ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దీన్ని బట్టి చూస్తుంటే బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్స్‌ కంటే కంటెంట్‌ ముఖ్యమని సగటు సినీ ప్రేక్షకుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
 

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)