9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
నాన్న కొడతాడేమోనని అబద్ధం చెప్పా: రామ్‌చరణ్
Published on Sat, 05/30/2026 - 12:23
పెద్ది సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చాలానే కష్టపడ్డాడు. మొన్నటివరకు సెట్స్‌లో కష్టపడితే ఇప్పుడు ప్రమోషన్స్ కోసం పరుగులు పెడుతున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తాను అబద్ధం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. లోకజ్ఞానం లేకుండానే పెరిగాను.
నాన్నతో సెట్‌కు వెళ్లాలంటే భయం
అజ్ఞానంతో ఉండటం కూడా ఒక అదృష్టమైతే అందుకు నేనే ఉదాహరణ. మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండేదే కాదు. సినిమా మ్యాగజైన్లు, అవార్డులు అన్నీ నాన్న ఆఫీసులోనే ఉండేవి. ఎప్పుడైనా ఆ మ్యాగజైన్లు కనిపిస్తే.. వాటిని ముట్టుకోవాలన్నా సరే భయమేసేది. నాన్న ఎంత గొప్ప నటుడు అనేది నాకు తెలిసేది కాదు. నాన్నతో షూటింగ్ సెట్‌కు వెళ్లాలన్నా భయంగానే ఉండేది. ఆయన పిలిస్తే తప్ప తన వెంట వెళ్లేవాడిని కాదు.
అబద్ధం చెప్పా..
నాకు యాక్టింగ్ అంటే ఆసక్తి ఉన్నప్పటికినీ దాన్ని పైకి చెప్పేంత ధైర్యం లేదు. నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు అనుకుంటా.. ఏమవ్వాలనుకుంటున్నావు? అని నాన్న అడిగాడు. ఆయన మెప్పు పొందేందుకు మెకానికల్ ఇంజనీర్ అవుతానని అబద్ధం చెప్పాను. నటుడిని అవుతానంటే బుద్ధిగా చదువుకోక హీరో అవుతావా? అని ఎక్కడ కొడతారో అని భయపడ్డాను. కానీ, కరెక్ట్ సమయం వచ్చిందని ఆయనకు అనిపించినప్పుడు తనే పిలిచి మరీ సినిమాలు చేయమన్నాడు అని రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. రామ్‌చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది జూన్ 4న విడుదలవుతోంది.
చదవండి: హీరో అజిత్ తల్లి కన్నుమూత
Tags : 1