Breaking News

మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి...‘ధురంధర్‌’ ప్రొడక్షన్‌ డిజైనర్‌పై కేసు

Published on Wed, 05/27/2026 - 11:26

చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆడిషన్‌ల పేరుతో, షూటింగ్ లొకేషన్స్‌లో, వర్కింగ్ కండిషన్స్‌లో మహిళా నటీనటులు మాత్రమే కాదు టెక్నీషియన్లు కూడా నిరంతరం వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ధురంధర్’మూవీకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన ఓ యువతిని ఆ సినిమా ప్రొడక్షన్‌ డిజైనర్‌ సైనీ జోహ్రే లైంగిక వేధింపులకు గురి చేశాడు. పని పేరుతో హోటల్‌కి పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాజాగా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మత్తుమందు ఇచ్చి.. 
యువతి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌ 10న సినిమాకు సంబంధించిన చర్చల కోసం సైనీ ఆమెను ఛండీగడ్‌లోని హోటల్‌కి రమ్మని చెప్పాడు. టీమ్‌ మీటింగ్‌ అనుకొని రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె అక్కడకు వెళ్లింది. గదిలోకి వెళ్లేసరికి అక్కడ  ఎవరూ లేరు. ప్లాన్‌ ప్రకారం సైనీ జోహ్రే ఆమెను మాత్రమే ఆహ్వానించాడు. ఆమె రాగానే వైన్‌లో మత్తుమందు కలిపి తాగమని బలవంతం చేశాడు. ఆమె అది సేవించగానే తలతిరిగినట్లుగా అనిపించింది. అదే సమయంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవరించాడు.

(చదవండి: చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు)

కెరీర్‌ నాశనం చేస్తానని బెదిరింపులు
తనకు అనారోగ్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. బాత్రూంకి వెళ్లి వాంతులు చేసుకున్నా. అక్కడ కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లనీయకుండా బలవంతం చేశాడు. రాత్రంతా అక్కడే ఉన్నా. మరసటి రోజు ఉదయమే క్యాబ్‌ బుక్‌ చేసుకొని ఇంటికి వెళ్లిపోయా. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్తే కెరీర్‌ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులు రోజు రోజుకి ఎక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నా’ అని సదరు యువతి పేర్కొంది.  యువతి ఫిర్యాదు మేరకు చండీగఢ్‌  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)